Title (Indic)రూకలై మాడలై రువ్వలై తిరిగీని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రూకలై మాడలై రువ్వలై తిరిగీని దాకొని వున్నచోటఁ దా నుండ దదివో (॥రూక॥) వొకరి రాజుఁజేసు నొకరి బంటుగఁ జేసు వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు వొకచోటనున్న ధాన్య మొకచోట వేయించు ప్రకటించి కనకమే భ్రమయించీ జగము (॥రూక॥) కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు కొందరికి పుణ్యులఁజేసుఁ గొందరి పాపులఁజేసు కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు పందెమాడినటువలెఁ బచరించు పసిఁడీ (॥రూక॥) నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు తగిలి శ్రీవేంకటేశు తరుణియై తా నుండు తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు నగుతా మాపాల నుండి నటియించు బసిఁడీ English(||pallavi||) rūgalai māḍalai ruvvalai tirigīni dāgŏni vunnasoḍam̐ dā nuṁḍa dadivo (||rūga||) vŏgari rājum̐jesu nŏgari baṁṭugam̐ jesu vŏgari kannĕgala verŏgarigi nammiṁchu vŏgasoḍanunna dhānya mŏgasoḍa veyiṁchu pragaḍiṁchi kanagame bhramayiṁchī jagamu (||rūga||) kŏṁdarijāḽĕlu niṁḍu kŏṁdarigi sŏmmulavu kŏṁdarigi puṇyulam̐jesum̐ gŏṁdari pābulam̐jesu kŏṁdarigŏṁdarilona kŏṭlāḍa vĕṭṭiṁchu paṁdĕmāḍinaḍuvalĕm̐ basariṁchu pasim̐ḍī (||rūga||) niganigamanusuṁḍu nikṣhebamai yuṁḍu tagili śhrīveṁkaḍeśhu taruṇiyai tā nuṁḍu tĕganimāyai yuṁḍu dikku dĕsayai yuṁḍu nagudā mābāla nuṁḍi naḍiyiṁchu basim̐ḍī