Title (Indic)రమణులము నేమింత రవ్వ కోపేమా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రమణులము నేమింత రవ్వ కోపేమా చెమరించీని మొకము చేరి విసరినాను (॥రమ॥) మచ్చిక మీఁదఁ గల మగువలకెల్లాను యిచ్చకమే సేయవలె నెక్కడా నీకు యెచ్చుకుందులైన మాటలేమీనాడఁగరాదు పచ్చిదేరీని పనులు భావించి చూచినను (॥రమ॥) పెట్టిన శాసల నీ ప్రియురాండ్రెల్లాను గుట్టుతోడనుండవలెఁ గోరి నీవద్ద చిట్టకాలు సేయరాదు చింతతోనుండఁగరాదు వొట్టుకొనె వానలెల్లా వొరసిచూచినను (॥రమ॥) కూడిన నీకూటములకోమలులకెల్లాను తోడునీడై యుండవలె తొరలి నీకు జాడతో నన్నుఁగూడితి సాదించరాదు నిన్ను వోడక శ్రీ వెంకటేశ వొద్దికైతివిపుడు English(||pallavi||) ramaṇulamu nemiṁta ravva kobemā sĕmariṁchīni mŏgamu seri visarinānu (||rama||) machchiga mīm̐dam̐ gala maguvalagĕllānu yichchagame seyavalĕ nĕkkaḍā nīgu yĕchchuguṁdulaina māḍalemīnāḍam̐garādu pachchiderīni panulu bhāviṁchi sūsinanu (||rama||) pĕṭṭina śhāsala nī priyurāṁḍrĕllānu guṭṭudoḍanuṁḍavalĕm̐ gori nīvadda siṭṭagālu seyarādu siṁtadonuṁḍam̐garādu vŏṭṭugŏnĕ vānalĕllā vŏrasisūsinanu (||rama||) kūḍina nīgūḍamulagomalulagĕllānu toḍunīḍai yuṁḍavalĕ tŏrali nīgu jāḍado nannum̐gūḍidi sādiṁcharādu ninnu voḍaga śhrī vĕṁkaḍeśha vŏddigaidivibuḍu