Title (Indic)రావయ్య నావద్దికి రమణుఁడ నమ్మి నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రావయ్య నావద్దికి రమణుఁడ నమ్మి నేఁడు నీ వేమి సేసినాను నిన్ను మారు సేసేనా (॥॥) పంతాలకు నెవ్వతైనా పై కొని పెనఁగుఁ గాక చెంత నుండి నే బలిమి సేసేనా నిన్ను అంత నుండే మాటలాడే వాన వెట్టు కొమ్మనేవు యింతటి దొరవు నిన్ను నింకఁ బచ్చిసేతునా (॥॥) నవ్వుల నెవ్వతైనా సన్నలఁ గొంగు వట్టుఁగాక చివ్వన నీకొప్పు నేను చేతఁదీసేనా దవ్వుల నేల లోఁ గేవు తలఁపేల పెట్టేవు పువ్వువంటివాఁ డవు పైఁ బుప్పొడి చల్లేనా (॥॥) యేతుల నెవ్వతైనా మోవెంగిలి నీకుఁ జేసితే యీతల నే నటువలె నెమ్మె చూపినా ఘాతల శ్రీ వేంకటేశ కౌఁగిట బిగించితివి ఆతుమైనవాఁడవు ని న్నలయించ వచ్చేనా English(||pallavi||) rāvayya nāvaddigi ramaṇum̐ḍa nammi nem̐ḍu nī vemi sesinānu ninnu māru sesenā (||||) paṁtālagu nĕvvadainā pai kŏni pĕnam̐gum̐ gāga sĕṁta nuṁḍi ne balimi sesenā ninnu aṁta nuṁḍe māḍalāḍe vāna vĕṭṭu kŏmmanevu yiṁtaḍi dŏravu ninnu niṁkam̐ bachchisedunā (||||) navvula nĕvvadainā sannalam̐ gŏṁgu vaṭṭum̐gāga sivvana nīgŏppu nenu sedam̐dīsenā davvula nela lom̐ gevu talam̐pela pĕṭṭevu puvvuvaṁṭivām̐ ḍavu paim̐ buppŏḍi sallenā (||||) yedula nĕvvadainā movĕṁgili nīgum̐ jeside yīdala ne naḍuvalĕ nĕmmĕ sūbinā ghādala śhrī veṁkaḍeśha kaum̐giḍa bigiṁchidivi ādumainavām̐ḍavu ni nnalayiṁcha vachchenā