Title (Indic)రాతిరిఁ బగలనేటి రెంటి నడుమనుఁ జిక్కి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాతిరిఁ బగలనేటి రెంటి నడుమనుఁ జిక్కి వూఁత గాన వెళ్లనీరో వో యాసలాల (॥రాతి॥) దైవ మెప్పుడు గలఁడు తలఁచఁగలేము గాని కైవసమై జీవుఁడుండు కానరాదు గాని పూవు పిందెవంటి పాపపుణ్యములఁ జిక్కినాఁడ తోవచూపరో మాకు తొలుజన్మములాల (॥రాతి॥) లోకము మాయామయమై లోనుఁ గాకుండుఁ గాని జోక పరమాత్మలోనే సోదించము గాని కైకొని మూసితెరచే కనురెప్పలనుఁ జిక్కి వాకిలిఁ గనేఁ జూపరో వద్దనున్న కాలమా (?) (॥రాతి॥) రూపము విజ్ఞానమే రూఢి కెక్కనైతిఁ గాని కాపు శ్రీవేంకటేశుఁడే గతి గంటిఁ గాని యీవారి నేనై తే నిహపరాలకుఁ జిక్కి పైపూఁత లేమి గానఁ బాలించవో గురుఁడా English(||pallavi||) rādirim̐ bagalaneḍi rĕṁṭi naḍumanum̐ jikki vūm̐ta gāna vĕḽlanīro vo yāsalāla (||rādi||) daiva mĕppuḍu galam̐ḍu talam̐sam̐galemu gāni kaivasamai jīvum̐ḍuṁḍu kānarādu gāni pūvu piṁdĕvaṁṭi pābabuṇyamulam̐ jikkinām̐ḍa tovasūbaro māgu tŏlujanmamulāla (||rādi||) logamu māyāmayamai lonum̐ gāguṁḍum̐ gāni joga paramātmalone sodiṁchamu gāni kaigŏni mūsidĕrase kanurĕppalanum̐ jikki vāgilim̐ ganem̐ jūbaro vaddanunna kālamā (?) (||rādi||) rūbamu vijñāname rūḍhi kĕkkanaidim̐ gāni kābu śhrīveṁkaḍeśhum̐ḍe gadi gaṁṭim̐ gāni yīvāri nenai te nihabarālagum̐ jikki paibūm̐ta lemi gānam̐ bāliṁchavo gurum̐ḍā