Title (Indic)రాతిరే చెప్పియంపితి రమ్మనవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాతిరే చెప్పియంపితి రమ్మనవే యేతులు పచరించఁగ నిఁకనేలే (॥రాతి॥) మనసు మర్మము సోఁకె మాటలెల్లఁ దేటలాయ తనకు నాకిఁక వేరే తగవేలే వెనకటి సుద్దు లవి వింతవింతలాగు లివి తనిసితి నన్నిటాను తారుకాణలేలే (॥రాతి॥) చూపులు రూపై నిలిచె సూట్లు వాఁటాన కెక్కె వోపిక లిద్దరివాయ వొట్లేలే తీపులపైఁ దీపు తొల్లి తేనెలపై తేనే, నేఁడు యీపసన నే నెఱుఁగుదు యెచ్చరించనేలే (॥రాతి॥) తనువులు జంటలాయ తమకము పెంటలాయ చనవిచ్చెఁ దా నాకు సటలేలే వినుకలాయ నప్పుడు కనుకలాయ నిప్పుడు యెనసె శ్రీ వేంకటేశుఁ డింకా నేలే English(||pallavi||) rādire sĕppiyaṁpidi rammanave yedulu pasariṁcham̐ga nim̐kanele (||rādi||) manasu marmamu som̐kĕ māḍalĕllam̐ deḍalāya tanagu nāgim̐ka vere tagavele vĕnagaḍi suddu lavi viṁtaviṁtalāgu livi tanisidi nanniḍānu tārugāṇalele (||rādi||) sūbulu rūbai nilisĕ sūṭlu vām̐ṭāna kĕkkĕ vobiga liddarivāya vŏṭlele tībulabaim̐ dību tŏlli tenĕlabai tene, nem̐ḍu yībasana ne nĕṟum̐gudu yĕchchariṁchanele (||rādi||) tanuvulu jaṁṭalāya tamagamu pĕṁṭalāya sanavichchĕm̐ dā nāgu saḍalele vinugalāya nappuḍu kanugalāya nippuḍu yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṁkā nele