Title (Indic)పెళ్ళిచెట్టు మందుగాదు పెద్దకొండ లెక్కి తెచ్చే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పెళ్ళిచెట్టు మందుగాదు పెద్దకొండ లెక్కి తెచ్చే- నెల్లిచెట్టు చవిగాక నేమేల నీకు (॥॥) చెచ్చెరఁ బోరువెట్టిన సితకమ్మ వుండఁగాను నిచ్చలుఁబ్రియముచెప్పేనేమేల నీకు చొచ్చి వలచివచ్చిన సుప్పనాతి వుండఁగాను నెచ్చలినై పాయకుండేనేమేల నీకు (॥॥) పట్టితెచ్చినచెరలు పదారువే లుండఁగాను నిట్టిపిడి మేనదాన నేనేల నీకు గుట్టున వెలవెట్టనిగోపసతు లుండఁగాను నెట్టన వుంకువగొన్న నేమేల నీకు (॥॥) బూతమాటలకుఁ జిక్కి పురసతు లుండఁగాను నీతితో బుద్దులుచెప్పనేమేలు నీకు యీతల శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి నీతోఁ గాదనఁబోతే నేమేల నీకు English(||pallavi||) pĕḽḽisĕṭṭu maṁdugādu pĕddagŏṁḍa lĕkki tĕchche- nĕllisĕṭṭu savigāga nemela nīgu (||||) sĕchchĕram̐ boruvĕṭṭina sidagamma vuṁḍam̐gānu nichchalum̐briyamusĕppenemela nīgu sŏchchi valasivachchina suppanādi vuṁḍam̐gānu nĕchchalinai pāyaguṁḍenemela nīgu (||||) paṭṭidĕchchinasĕralu padāruve luṁḍam̐gānu niṭṭibiḍi menadāna nenela nīgu guṭṭuna vĕlavĕṭṭanigobasadu luṁḍam̐gānu nĕṭṭana vuṁkuvagŏnna nemela nīgu (||||) būdamāḍalagum̐ jikki purasadu luṁḍam̐gānu nīdido buddulusĕppanemelu nīgu yīdala śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi nīdom̐ gādanam̐bode nemela nīgu