Title (Indic)పట్టినచోనే వెదకి భావించవలెఁ గాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పట్టినచోనే వెదకి భావించవలెఁ గాని గట్టిగా నంతర్యామి కరుణించును (॥పట్టి॥) యింటిలోనిచీఁకటే యిట్టే తప్పకచూచితే వెంటనే కొంతవడికి వెలుఁగిచ్చును అంటి కానరానితనయాతుమ తప్పకచూచు- కొంటేఁ దనయాతుమయు గొబ్బునఁ గాన్పించును (॥పట్టి॥) మించి కఠినపురాతిమీఁదఁ గడవ వెట్టితే అంచెలఁ దానే కుదురై నయట్టు పొంచి హరినామమే యేపొద్దు నాలికతుదను యెంచి తలఁచఁదలచ నిరవౌ సుజ్ఞానము (॥పట్టి॥) వొక్కొక్కయడుగే వొగి ముందరఁ బెట్టితే యెక్కువై కొండైనా నెక్కుఁ గొనకు యిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును పక్కనఁ గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును English(||pallavi||) paṭṭinasone vĕdagi bhāviṁchavalĕm̐ gāni gaṭṭigā naṁtaryāmi karuṇiṁchunu (||paṭṭi||) yiṁṭilonisīm̐kaḍe yiṭṭe tappagasūside vĕṁṭane kŏṁtavaḍigi vĕlum̐gichchunu aṁṭi kānarānidanayāduma tappagasūsu- kŏṁṭem̐ danayādumayu gŏbbunam̐ gānpiṁchunu (||paṭṭi||) miṁchi kaṭhinaburādimīm̐dam̐ gaḍava vĕṭṭide aṁchĕlam̐ dāne kudurai nayaṭṭu pŏṁchi harināmame yebŏddu nāligadudanu yĕṁchi talam̐sam̐dalasa niravau sujñānamu (||paṭṭi||) vŏkkŏkkayaḍuge vŏgi muṁdaram̐ bĕṭṭide yĕkkuvai kŏṁḍainā nĕkkum̐ gŏnagu yikkuva śhrīveṁkaḍeśhu niḍu dinadinamunu pakkanam̐ gŏliside brahmabaṭṭa mĕkkunu