Title (Indic)పట్టరాని యాసోదము పాలువొంగినట్టు వొంగి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పట్టరాని యాసోదము పాలువొంగినట్టు వొంగి పుట్టి పుట్టి విసిగినాఁ బోనీదు మాయ (॥పట్టరాని॥) కన్నులెదుట నున్నవి కావలసిన వెల్లాను యెన్ని గట్టు కొనఁగలఁ డీ జీవుఁడు వెన్నాడి తిరిగితే విశ్వ మెల్లా మనుజులే యెన్నఁగఁ జుట్టము లెవ్వ రిందు దనకు (॥పట్టరాని॥) వింత వింత రుచులై వెలసీఁ బదార్థములు యెంతని వొట్టు కొనీని యీ ప్రాణి మంతనానఁ దలఁచితే మనసెల్లాఁ గోరికలే యింత సేసి పెనఁగఁగా నేమి నిజ మాయెను (॥పట్టరాని॥) ఆముకొని జగమెల్లా నంగజవికారములే యేమని భోగించీని యీ దేహి నేమపు శ్రీవేంకటేశ నీవే నాకు గతి యిఁక పామర బుదులవంకఁ బని యే మున్నది English(||pallavi||) paṭṭarāni yāsodamu pāluvŏṁginaṭṭu vŏṁgi puṭṭi puṭṭi visiginām̐ bonīdu māya (||paṭṭarāni||) kannulĕduḍa nunnavi kāvalasina vĕllānu yĕnni gaṭṭu kŏnam̐galam̐ ḍī jīvum̐ḍu vĕnnāḍi tirigide viśhva mĕllā manujule yĕnnam̐gam̐ juṭṭamu lĕvva riṁdu danagu (||paṭṭarāni||) viṁta viṁta rusulai vĕlasīm̐ badārdhamulu yĕṁtani vŏṭṭu kŏnīni yī prāṇi maṁtanānam̐ dalam̐side manasĕllām̐ gorigale yiṁta sesi pĕnam̐gam̐gā nemi nija māyĕnu (||paṭṭarāni||) āmugŏni jagamĕllā naṁgajavigāramule yemani bhogiṁchīni yī dehi nemabu śhrīveṁkaḍeśha nīve nāgu gadi yim̐ka pāmara budulavaṁkam̐ bani ye munnadi