Title (Indic)పంతగాఁడు మిక్కిలి నీ పవనజుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పంతగాఁడు మిక్కిలి నీ పవనజుఁడు రంతుకెక్కె మతంగపర్వత పవనజుఁడు (॥పంత॥) వాలాయమై యెంతభాగ్యవంతుఁడో దేవతలచే బాలుఁడై వరములందెఁ బవనజుఁడు పాలజలనిధి దాఁటి పరగ సంజీవి దెచ్చి యేలికముందరఁ బెట్టె యీ పవనుజుఁడు (॥పంత॥) సొంటులు సోదించితెచ్చి సుగ్రీవు రాఘవునికి బంటుగాఁగఁ బొందుసేసెఁ బవనజుఁడు వొంటినే రామునిముద్ర వొసఁగి సీతముందర మింటిపొడవై పెరిగె మేఁటి పవనజుఁడు (॥పంత॥) కిట్టి శ్రీవేంకటేశ్వరుకృపచే ముందరిబ్రహ్మ- పట్ట మేలనున్నవాఁడు పవనజుఁడు చుట్టి చుట్టి తనకు దాసులయినవారికి గట్టి వరములిచ్చె నీ ఘనపవనజుఁడు English(||pallavi||) paṁtagām̐ḍu mikkili nī pavanajum̐ḍu raṁtugĕkkĕ madaṁgabarvada pavanajum̐ḍu (||paṁta||) vālāyamai yĕṁtabhāgyavaṁtum̐ḍo devadalase bālum̐ḍai varamulaṁdĕm̐ bavanajum̐ḍu pālajalanidhi dām̐ṭi paraga saṁjīvi dĕchchi yeligamuṁdaram̐ bĕṭṭĕ yī pavanujum̐ḍu (||paṁta||) sŏṁṭulu sodiṁchidĕchchi sugrīvu rāghavunigi baṁṭugām̐gam̐ bŏṁdusesĕm̐ bavanajum̐ḍu vŏṁṭine rāmunimudra vŏsam̐gi sīdamuṁdara miṁṭibŏḍavai pĕrigĕ mem̐ṭi pavanajum̐ḍu (||paṁta||) kiṭṭi śhrīveṁkaḍeśhvarukṛpase muṁdaribrahma- paṭṭa melanunnavām̐ḍu pavanajum̐ḍu suṭṭi suṭṭi tanagu dāsulayinavārigi gaṭṭi varamulichchĕ nī ghanabavanajum̐ḍu