Title (Indic)పాపముఁ బుణ్యముఁ బరకట నున్నది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాపముఁ బుణ్యముఁ బరకట నున్నది చేపట్టుము నీ చేతిదీ ప్రాణి (॥పాప॥) నాలుక కొనలనె నానుచునున్నది గాలపు నిజమునుఁ గల్లయును వాలుచును తాసువలె నున్నదిదె తాలిమి ధర్మాధర్మములు (॥పాప॥) చేతుల కొనలను చేఁతై యున్నది జాతిగ నరకము స్వర్గమును ఆతల వేదోక్తమైన కర్మములు దాతనె పిడికిటఁ దగిలెను వెదకు(?) (॥పాప॥) మనసు కొట్టఁగొన మాయయు నున్నది వెనక శ్రీవేంకటవిభుఁడు నదే తనరిన యాతని దాస్యము నున్నది విని చేకొందువు వెదకవో నీవు English(||pallavi||) pābamum̐ buṇyamum̐ baragaḍa nunnadi sebaṭṭumu nī sedidī prāṇi (||pāba||) nāluga kŏnalanĕ nānusununnadi gālabu nijamunum̐ gallayunu vālusunu tāsuvalĕ nunnadidĕ tālimi dharmādharmamulu (||pāba||) sedula kŏnalanu sem̐tai yunnadi jādiga naragamu svargamunu ādala vedoktamaina karmamulu dādanĕ piḍigiḍam̐ dagilĕnu vĕdagu(?) (||pāba||) manasu kŏṭṭam̐gŏna māyayu nunnadi vĕnaga śhrīveṁkaḍavibhum̐ḍu nade tanarina yādani dāsyamu nunnadi vini segŏṁduvu vĕdagavo nīvu