Title (Indic)ఒక్కచోటనే వున్నారు వొద్దిక నాతఁడూ నీవూ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఒక్కచోటనే వున్నారు వొద్దిక నాతఁడూ నీవూ చెక్కుల చేతులతోడ చింత లిఁక నేఁటికే (॥ఒక్క॥) మనసు లొడఁబడితే మాఁటలకుఁ జోటు గద్దు తనువులు సోఁకితేను తమి రేఁగును చెనకు లగ్గలమైతే సిగ్గులును నుప్పతిలు చనవు సేసుక పతి సంగాతాలు సేయవే (॥ఒక్క॥) మొగమొగాలు చూచితే మోహములు పెనగొను నగవులు వలపుల నానఁబెట్టును తగులాయపుఁ జేఁతలు తాలిములు వొడమించు వెగటులే కితనితో వినోదము లాడవే (॥ఒక్క॥) అలమి పైకొంటేను ఆయములు గరఁగును తలపోఁత కోరికలు తనివొందించు యెలమి శ్రీవేంకటేశఉఁ డింతలోనె నిన్నుఁ గూడె నెలకొనె నీ పంతాలు నిండుక వుండఁగదే English(||pallavi||) ŏkkasoḍane vunnāru vŏddiga nādam̐ḍū nīvū sĕkkula seduladoḍa siṁta lim̐ka nem̐ṭige (||ŏkka||) manasu lŏḍam̐baḍide mām̐ṭalagum̐ joḍu gaddu tanuvulu som̐kidenu tami rem̐gunu sĕnagu laggalamaide siggulunu nuppadilu sanavu sesuga padi saṁgādālu seyave (||ŏkka||) mŏgamŏgālu sūside mohamulu pĕnagŏnu nagavulu valabula nānam̐bĕṭṭunu tagulāyabum̐ jem̐talu tālimulu vŏḍamiṁchu vĕgaḍule kidanido vinodamu lāḍave (||ŏkka||) alami paigŏṁṭenu āyamulu garam̐gunu talabom̐ta korigalu tanivŏṁdiṁchu yĕlami śhrīveṁkaḍeśha̮um̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ nĕlagŏnĕ nī paṁtālu niṁḍuga vuṁḍam̐gade