Title (Indic)నిన్నుఁ జూచి నాకైతే నెరవుగా దయవుట్టె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నిన్నుఁ జూచి నాకైతే నెరవుగా దయవుట్టె యెన్నిటి కోపుదువు మాయింటికి రావయ్యా (॥నిన్ను॥) చేసన్న సేసి యొకతె చెట్టవట్టి తీసె నిన్ను ఆసల వొకతె నిన్ను నట్టె నవ్వెను యీసందుల నీమనసు యిరుమొనసూదాయ సేసల యిద్దరిచేతఁ జిక్కెఁగా నీతురుము (॥నిన్ను॥) కందువకుఁ దెచ్చొకతె కాఁగిలించుకుండఁగాను మందలించి వేరొకతె మర్మమంటీని అంది తాసువంటిదాయ అట్టె నీరతియెల్ల సందడి నిద్దరిచేత సదమదమైతివి (॥నిన్ను॥) మునుప వేరొకతె నీమోవి గంటిసేయఁ గామ వెనక నొకతె గోరు వీఁపు మోపీని యెనసితి నే నిన్ను యింతో శ్రీవేంకటేశ అనువై ముక్కాలిపీఁట వైతివి గా యిపుడు English(||pallavi||) ninnum̐ jūsi nāgaide nĕravugā dayavuṭṭĕ yĕnniḍi kobuduvu māyiṁṭigi rāvayyā (||ninnu||) sesanna sesi yŏgadĕ sĕṭṭavaṭṭi tīsĕ ninnu āsala vŏgadĕ ninnu naṭṭĕ navvĕnu yīsaṁdula nīmanasu yirumŏnasūdāya sesala yiddarisedam̐ jikkĕm̐gā nīdurumu (||ninnu||) kaṁduvagum̐ dĕchchŏgadĕ kām̐giliṁchuguṁḍam̐gānu maṁdaliṁchi verŏgadĕ marmamaṁṭīni aṁdi tāsuvaṁṭidāya aṭṭĕ nīradiyĕlla saṁdaḍi niddariseda sadamadamaidivi (||ninnu||) munuba verŏgadĕ nīmovi gaṁṭiseyam̐ gāma vĕnaga nŏgadĕ goru vīm̐pu mobīni yĕnasidi ne ninnu yiṁto śhrīveṁkaḍeśha anuvai mukkālibīm̐ṭa vaidivi gā yibuḍu