Title (Indic)నేరుపుతో నీదాననై నిండుకుండేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేరుపుతో నీదాననై నిండుకుండేను వోరికొట్లు గొట్ట ని న్నోపమయ్యా (॥నేరు॥) వాసికి రేఁచుక తిట్టి వంగివంగి మొక్కఁబట్టె యీసుల నీతోడివాదులేలయ్య మాకు చేసూటి నీతోఁ బెనఁగి చెక్కులు నొక్కఁగఁబట్టె వోసరించి నిన్నొరయనోపమయ్యా (॥నేరు॥) కన్నులను జంకించి కడువేఁడుకొనఁబట్టె యెన్నిక నీతోనలుగనేలయ్య మాకు పన్నినీతో మచ్చరించి పంతములియ్యఁగఁబట్టె వున్నతితో మాట మీరనోపమయ్యా (॥నేరు॥) చలముసాదించఁబోయి చవులు చూపఁబట్టె యెలమినిను గద్దించనేలయ్య మాకు అలమేలుమంగను నేనదెశ్రీవేంకటేశుఁడ వొలిసి కూడితిఁ బాయనోపమయ్యా English(||pallavi||) nerubudo nīdānanai niṁḍuguṁḍenu vorigŏṭlu gŏṭṭa ni nnobamayyā (||neru||) vāsigi rem̐suga tiṭṭi vaṁgivaṁgi mŏkkam̐baṭṭĕ yīsula nīdoḍivādulelayya māgu sesūḍi nīdom̐ bĕnam̐gi sĕkkulu nŏkkam̐gam̐baṭṭĕ vosariṁchi ninnŏrayanobamayyā (||neru||) kannulanu jaṁkiṁchi kaḍuvem̐ḍugŏnam̐baṭṭĕ yĕnniga nīdonaluganelayya māgu panninīdo machchariṁchi paṁtamuliyyam̐gam̐baṭṭĕ vunnadido māḍa mīranobamayyā (||neru||) salamusādiṁcham̐boyi savulu sūbam̐baṭṭĕ yĕlamininu gaddiṁchanelayya māgu alamelumaṁganu nenadĕśhrīveṁkaḍeśhum̐ḍa vŏlisi kūḍidim̐ bāyanobamayyā