Title (Indic)నేనిఁక వెఱపను నీవు నాకుఁ గలవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేనిఁక వెఱపను నీవు నాకుఁ గలవు శ్రీనాథ నిన్నెఱిఁగితి చేకొని రక్షింతువు (॥నేనిఁక॥) మొల్లమి నే నొకజన్మమున నిన్నుఁ గొలువఁగా తొల్లి జన్మము లెత్తిన దుఃఖము వాసె యిల్లిదే యీ దేహమున యిటు నీ యచ్చు మోపఁగా చిల్లరదేహములు మోచినచింత లుడిగె (॥నేనిఁక॥) యిల నిన్నొకనిమిష మిటు థ్యానము సేయఁగా గలిఁ బోయిన కాలము నష్టి దీరెను చలపట్టి నీ దాసులసహవాసము గల్గగా నల మాయలో నీఁదిన యల పెల్లఁ బొలిసె (॥నేనిఁక॥) కనుఁగొని వేడ్కతో నీ కన్నులెదుటఁ బడఁగా ఘననరక మందిన కాఁక మానెను యెనలేక శ్రీవేంకటేశ నిన్నుఁ దలఁచగా వెనకటి యజ్ఞానపు వెగ టెల్లాఁ గడచె English(||pallavi||) nenim̐ka vĕṟabanu nīvu nāgum̐ galavu śhrīnātha ninnĕṟim̐gidi segŏni rakṣhiṁtuvu (||nenim̐ka||) mŏllami ne nŏgajanmamuna ninnum̐ gŏluvam̐gā tŏlli janmamu lĕttina duḥkhamu vāsĕ yillide yī dehamuna yiḍu nī yachchu mobam̐gā sillaradehamulu mosinasiṁta luḍigĕ (||nenim̐ka||) yila ninnŏganimiṣha miḍu thyānamu seyam̐gā galim̐ boyina kālamu naṣhṭi dīrĕnu salabaṭṭi nī dāsulasahavāsamu galgagā nala māyalo nīm̐dina yala pĕllam̐ bŏlisĕ (||nenim̐ka||) kanum̐gŏni veḍkado nī kannulĕduḍam̐ baḍam̐gā ghananaraga maṁdina kām̐ka mānĕnu yĕnalega śhrīveṁkaḍeśha ninnum̐ dalam̐sagā vĕnagaḍi yajñānabu vĕga ṭĕllām̐ gaḍasĕ