Title (Indic)నీకు వలయు పనికి నీవే వెతకి వచ్చితి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీకు వలయు పనికి నీవే వెతకి వచ్చితి శ్రీకాంతుఁడవు ఇట్టె చేకొనవే నన్నును (॥నీకు॥) నిన్నుఁ బాసి లంకలోన నెయ్యపుసీతాదేవి పన్ని విరహానఁ దపము సేయఁగా వున్నతపుఁగొండలచే వూరక జలధిఁగట్టి చెన్నగురావణుఁ జంపి చేకొనవా ఆకెను (॥నీకు॥) నీవే కావలెనని నిన్నుఁ గోరి రుకుమిణి తోవలఁ బెండ్లికి నెదురుచూడఁగా దావతితో నంతలోనే ద్వారకనుండి వచ్చి చేవల దుష్టులఁ జంపి చేకొనవా ఆకెను (॥నీకు॥) పాయపురమాదేవి పాలజలధినుండి కాయజకేలికి నినుఁ గనుగొనఁగా యీయెడ శ్రీవేంకటేశ యిందుకే జలధి దచ్చి చేయిచ్చి వుర మెక్కించితివిగా యాకెను English(||pallavi||) nīgu valayu panigi nīve vĕdagi vachchidi śhrīgāṁtum̐ḍavu iṭṭĕ segŏnave nannunu (||nīgu||) ninnum̐ bāsi laṁkalona nĕyyabusīdādevi panni virahānam̐ dabamu seyam̐gā vunnadabum̐gŏṁḍalase vūraga jaladhim̐gaṭṭi sĕnnagurāvaṇum̐ jaṁpi segŏnavā āgĕnu (||nīgu||) nīve kāvalĕnani ninnum̐ gori rugumiṇi tovalam̐ bĕṁḍligi nĕdurusūḍam̐gā dāvadido naṁtalone dvāraganuṁḍi vachchi sevala duṣhṭulam̐ jaṁpi segŏnavā āgĕnu (||nīgu||) pāyaburamādevi pālajaladhinuṁḍi kāyajageligi ninum̐ ganugŏnam̐gā yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁduge jaladhi dachchi seyichchi vura mĕkkiṁchidivigā yāgĕnu