Title (Indic)నీ తలనే వేగెనటే నెలఁత యీ సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ తలనే వేగెనటే నెలఁత యీ సుద్దులు ఆతని ననేముగాక ఆఁడువారు కరవా (॥నీత॥) పనిగలయప్పుడే పంతములెల్లా నాడేది పెనఁగవచ్చితే నట్టె బిగిసేది చెనకఁజూచినవేళే చేరి బాస లడిగేది వొనరఁదుచ్చపువారివోజ లింతేకా (॥నీత॥) నగవచ్చినప్పుడేనంటుకొనఁ దిట్టేది మొగము చూచినంతనే ముణిఁచేది తగిలి వెనుకొంటేనే తరితీపు సేసేది జగతిఁ జిత్తిణివారిసాజ మింతేకా (॥నీత॥) రతికిఁ దీసినప్పుడే రాజసము చూపేది తతి వచ్చితేనే లోలోఁ దమకించేది యితఁడె శ్రీవేంకటేశుఁ డిందరి మనలఁ గూడె మితిమీరేది కాంతలమేకు లింతేకా English(||pallavi||) nī talane vegĕnaḍe nĕlam̐ta yī suddulu ādani nanemugāga ām̐ḍuvāru karavā (||nīda||) panigalayappuḍe paṁtamulĕllā nāḍedi pĕnam̐gavachchide naṭṭĕ bigisedi sĕnagam̐jūsinaveḽe seri bāsa laḍigedi vŏnaram̐duchchabuvārivoja liṁtegā (||nīda||) nagavachchinappuḍenaṁṭugŏnam̐ diṭṭedi mŏgamu sūsinaṁtane muṇim̐sedi tagili vĕnugŏṁṭene taridību sesedi jagadim̐ jittiṇivārisāja miṁtegā (||nīda||) radigim̐ dīsinappuḍe rājasamu sūbedi tadi vachchidene lolom̐ damagiṁchedi yidam̐ḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁdari manalam̐ gūḍĕ midimīredi kāṁtalamegu liṁtegā