Title (Indic)నీ మగఁ డిందరిలోన నీపైనే వలపు చూపీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ మగఁ డిందరిలోన నీపైనే వలపు చూపీ చే ముంచి కైవస మెంత సేసుకొంటివో (॥నీమ॥) సారె నీమొగ మాతఁడు చల్లుఁజూపులను జూచి నారువోసినట్లనే నవ్వులు నవ్వీ నేరుపులెల్లా మెరసి నీతోనే మాటలాడీ దారకాన నీ వెంతతపము సేసితివో (॥నీమ॥) చేరి నిన్ను రమణుఁడు చెక్కునొక్కి వేఁడుకొని గారవించి నీగుణాలు కడుమెచ్చీని చేరువనే కూచుండి సింగారాలు నీకుఁ జేసీ చూరలుగా మనసెంత చొక్క జేసితివొ (॥నీమ॥) అలమి శ్రీవేంకటేశుఁ డంది నీకు విడెమిచ్చి తలకోన లాలించి తమిరేఁచీని అలమేలుమంగవు నీయంకెలనే మెలఁగీని పిలి చెటువంటివేళఁ బెండ్లియాడితివొ English(||pallavi||) nī magam̐ ḍiṁdarilona nībaine valabu sūbī se muṁchi kaivasa mĕṁta sesugŏṁṭivo (||nīma||) sārĕ nīmŏga mādam̐ḍu sallum̐jūbulanu jūsi nāruvosinaṭlane navvulu navvī nerubulĕllā mĕrasi nīdone māḍalāḍī dāragāna nī vĕṁtadabamu sesidivo (||nīma||) seri ninnu ramaṇum̐ḍu sĕkkunŏkki vem̐ḍugŏni gāraviṁchi nīguṇālu kaḍumĕchchīni seruvane kūsuṁḍi siṁgārālu nīgum̐ jesī sūralugā manasĕṁta sŏkka jesidivŏ (||nīma||) alami śhrīveṁkaḍeśhum̐ ḍaṁdi nīgu viḍĕmichchi talagona lāliṁchi tamirem̐sīni alamelumaṁgavu nīyaṁkĕlane mĕlam̐gīni pili sĕḍuvaṁṭiveḽam̐ bĕṁḍliyāḍidivŏ