Title (Indic)నీ కెప్పుడు చూచినాను నేనే యితవరిఁ జుమీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీ కెప్పుడు చూచినాను నేనే యితవరిఁ జుమీ పైకొని ముందుగా విన్నపము సేసికొంటిని (॥॥) కొప్పు జారే నంటీ నింతే కొంగు వట్టేవు సుమీ దెప్పరాన నేఁడది తెలుపు మని యిప్పు డద్దము చూపితే నిట్టే కోపగించకుమీ కప్పి సింగారము తారుకాణించవలెను (॥॥) కళలు నిండే మోమంటే కాంతాళించేవు సుమీ సొలసి నీకు దిష్టాలు చూపు మని చెలఁగి తెర వేసితే సిగ్గులు వడకుమీ అలపారఁ బవళించు మంటీ నింతే నేను (॥॥) వూరకే నవ్వితి నింతే వొట్టు వెట్టేవు సుమీ కారణ మిందుకుఁ బోల గడించు మని యీ రీతి శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను చేరి నన్నేలఁగా సంతోసించితి నేను English(||pallavi||) nī kĕppuḍu sūsinānu nene yidavarim̐ jumī paigŏni muṁdugā vinnabamu sesigŏṁṭini (||||) kŏppu jāre naṁṭī niṁte kŏṁgu vaṭṭevu sumī dĕpparāna nem̐ḍadi tĕlubu mani yippu ḍaddamu sūbide niṭṭe kobagiṁchagumī kappi siṁgāramu tārugāṇiṁchavalĕnu (||||) kaḽalu niṁḍe momaṁṭe kāṁtāḽiṁchevu sumī sŏlasi nīgu diṣhṭālu sūbu mani sĕlam̐gi tĕra veside siggulu vaḍagumī alabāram̐ bavaḽiṁchu maṁṭī niṁte nenu (||||) vūrage navvidi niṁte vŏṭṭu vĕṭṭevu sumī kāraṇa miṁdugum̐ bola gaḍiṁchu mani yī rīdi śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu seri nannelam̐gā saṁtosiṁchidi nenu