Title (Indic)నా తప్పు లోఁ గొనవే నన్నుఁ గావవే దేవ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా తప్పు లోఁ గొనవే నన్నుఁ గావవే దేవ చేఁతలిన్నీఁ జేసి నిన్నుఁ జేరి శరణంటిని (॥నా తప్పు॥) అందరిలో నంతర్యామివై నీవుండఁగాను యిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళును సందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగాను వందులేక నేఁ గొన్నివాహనా లెక్కితివి (॥నా తప్పు॥) లోకపరిపూర్ణుఁడవై లోనా వెలి నుండఁగాను చేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితిని కైకొని యీమాయలు నీకల్పితమై వుండఁగాను చౌకలేక నేవేరే సంకల్పించితిని (॥నా తప్పు॥) యెక్కడచూచిన నీవే యేలికెవై వుండఁగాను యిక్కడాఁ దొత్తుల బంట్ల నేలితి నేను చక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేను మెక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను English(||pallavi||) nā tappu lom̐ gŏnave nannum̐ gāvave deva sem̐talinnīm̐ jesi ninnum̐ jeri śharaṇaṁṭini (||nā tappu||) aṁdarilo naṁtaryāmivai nīvuṁḍam̐gānu yiṁdarim̐ banulugŏṁṭi ninnāḽḽunu saṁdaḍiṁchi yinniḍā nīsaidanyamai yuṁḍam̐gānu vaṁdulega nem̐ gŏnnivāhanā lĕkkidivi (||nā tappu||) logabaribūrṇum̐ḍavai lonā vĕli nuṁḍam̐gānu segŏni pūvulum̐ baṁḍlum̐ jidimidini kaigŏni yīmāyalu nīgalbidamai vuṁḍam̐gānu saugalega nevere saṁkalbiṁchidini (||nā tappu||) yĕkkaḍasūsina nīve yeligĕvai vuṁḍam̐gānu yikkaḍām̐ dŏttula baṁṭla nelidi nenu sakkani śhrīveṁkaḍeśha sarvābarādhi nenu mĕkkidi nannu rakṣhiṁchu muṁdĕṟam̐ga nenu