Title (Indic)నా రమణునిఁ జూడరే నలినాక్షులాల నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా రమణునిఁ జూడరే నలినాక్షులాల నేఁడు గారవముతోడ నన్నుఁ గరుణించీ నిదివో (॥॥) మరిగిన యెడాటాన మంకు లేమి రేఁగవు సరవితోఁ బెనగితే చలము లేదు తిరమైన పొందులకు తెరమరఁ గెంచవద్దు నిరతపు వేడుకలే నిండుకొను మతిని (॥॥) మొగము చూచినమీఁద మొనయవు కాఁకలు నగఁ దొడఁ గితే మఱి నాట దలుక చిగిరించిన వలపు చేగలు దీరకపోదు మిగులాఁ దమకములే మేనఁ బెనగొనుము (॥॥) బలిమిఁ గూడిన తఱిఁ బంతములు వుట్టవు చెలఁగి యేకతమైతే సిగ్గు మించదు అలమేల్మంగను నేను అతఁడు శ్రీ వేంకటేశుఁ డిల నన్ను నేలె నిఁక నిచ్చకమౌ రతులు English(||pallavi||) nā ramaṇunim̐ jūḍare nalinākṣhulāla nem̐ḍu gāravamudoḍa nannum̐ garuṇiṁchī nidivo (||||) marigina yĕḍāḍāna maṁku lemi rem̐gavu saravidom̐ bĕnagide salamu ledu tiramaina pŏṁdulagu tĕramaram̐ gĕṁchavaddu niradabu veḍugale niṁḍugŏnu madini (||||) mŏgamu sūsinamīm̐da mŏnayavu kām̐kalu nagam̐ dŏḍam̐ gide maṟi nāḍa daluga sigiriṁchina valabu segalu dīragabodu migulām̐ damagamule menam̐ bĕnagŏnumu (||||) balimim̐ gūḍina taṟim̐ baṁtamulu vuṭṭavu sĕlam̐gi yegadamaide siggu miṁchadu alamelmaṁganu nenu adam̐ḍu śhrī veṁkaḍeśhum̐ ḍila nannu nelĕ nim̐ka nichchagamau radulu