Title (Indic)నా మోము చూచి చూచి నడుమ నేల కొంకేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మోము చూచి చూచి నడుమ నేల కొంకేవు ఆముకొని మెచ్చఁగా నే నడ్డమాడేనా (॥॥) బత్తి గలవాడవు పడఁతి పాట వింటివి చిత్తము రంజించి నీకు చెవి బట్టెనా యిత్తల మే చెమరించె నెంత గరఁగెనొ మతి పొత్తుల వాకుచ్చి యాకెఁ బొగడఁగరాదా (॥॥) సరి నిడుకొంటివి చదివించితి వా పెను తిరమైన యాయర్థము తెలిసితివా నిరతిఁ బలుకలెల్లా నిండెను సంతోసమెంతో అరదైనవుడుగర లట్టె ఇయ్యరాదా (॥॥) శ్రీవేంకటేశుడు చెలియాట చూచితివి భావించి నీకు గన్నుల పండుగాయనా యీవల నన్నేలితివి ఇదెంత జాణతనమో సేవసేసే మిద్దరము సేసచల్లరాదా English(||pallavi||) nā momu sūsi sūsi naḍuma nela kŏṁkevu āmugŏni mĕchcham̐gā ne naḍḍamāḍenā (||||) batti galavāḍavu paḍam̐ti pāḍa viṁṭivi sittamu raṁjiṁchi nīgu sĕvi baṭṭĕnā yittala me sĕmariṁchĕ nĕṁta garam̐gĕnŏ madi pŏttula vāguchchi yāgĕm̐ bŏgaḍam̐garādā (||||) sari niḍugŏṁṭivi sadiviṁchidi vā pĕnu tiramaina yāyardhamu tĕlisidivā niradim̐ balugalĕllā niṁḍĕnu saṁtosamĕṁto aradainavuḍugara laṭṭĕ iyyarādā (||||) śhrīveṁkaḍeśhuḍu sĕliyāḍa sūsidivi bhāviṁchi nīgu gannula paṁḍugāyanā yīvala nannelidivi idĕṁta jāṇadanamo sevasese middaramu sesasallarādā