Title (Indic)నా మొగము చూచి యెంత నగుతా సిగ్గుపడేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మొగము చూచి యెంత నగుతా సిగ్గుపడేవు కామించినవాని నిన్ను కాకుసేసేనా (॥నామొ॥) పెక్కుసతులను నీవు పెండ్లాడి వచ్చితివంటా వెక్కసాన నిన్నుఁ గదు వెంగెమాడేనా చిక్కించుక వారు నిన్నుఁ జెలరేగి తిట్టిరంటా అక్కడా నిక్కడా నిన్ను నాడుకొనేనా (॥నామొ॥) వాడవారితోడ నీవు వసంతాలాడేవంటా జాడగాదని నిన్ను సాదించేనా వాడిక నా సందడిలో వారికాళ్ళు దాఁకెవంటా యీడ నిన్ను గేలిసేసి యెత్తిపెట్టేనా (॥నామొ॥) కన్నవారినెల్లా నీవు కాఁగిటఁ గూడితివంటా సన్నలా చాయలా నిన్ను జంకించేనా అన్నిటా నలమేల్మంగ నైననన్ను నేలితివి చెన్నుగా శ్రీ వేంకటేశ సిగ్గువఱచేనా English(||pallavi||) nā mŏgamu sūsi yĕṁta nagudā siggubaḍevu kāmiṁchinavāni ninnu kāgusesenā (||nāmŏ||) pĕkkusadulanu nīvu pĕṁḍlāḍi vachchidivaṁṭā vĕkkasāna ninnum̐ gadu vĕṁgĕmāḍenā sikkiṁchuga vāru ninnum̐ jĕlaregi tiṭṭiraṁṭā akkaḍā nikkaḍā ninnu nāḍugŏnenā (||nāmŏ||) vāḍavāridoḍa nīvu vasaṁtālāḍevaṁṭā jāḍagādani ninnu sādiṁchenā vāḍiga nā saṁdaḍilo vārigāḽḽu dām̐kĕvaṁṭā yīḍa ninnu gelisesi yĕttibĕṭṭenā (||nāmŏ||) kannavārinĕllā nīvu kām̐giḍam̐ gūḍidivaṁṭā sannalā sāyalā ninnu jaṁkiṁchenā anniḍā nalamelmaṁga nainanannu nelidivi sĕnnugā śhrī veṁkaḍeśha sigguvaṟasenā