Title (Indic)నా మొగము చూచి యేమి నవ్వులు నవ్వేవు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మొగము చూచి యేమి నవ్వులు నవ్వేవు నీవు యీ మఱఁగు లీడేరె నెంత సేసేవు (॥నామొ॥) చిత్తరుపతిమవలె చెలి నిలుచుకున్నది హత్తి దండఁ గూచుండు మనఁగరాదా బత్తిసేసి నీకు నదె బాగా లందిఇచ్చీని కొత్తవలపు నీవందుకొనఁగరాదా (॥నామొ॥) మేనమఱఁదలి వలె మెలుత సరసమాడీ వీనులు చల్లఁగా నీవు వినఁగరాదా ఆనుక గుబ్బల నీకు నాస చూపుకవున్నది పేనిపట్టి వాఁటితోడఁ బెనఁగరాదా (॥నామొ॥) వలరారజుతల్లివలె వనిత నీకుఁ గలిగె మలసి యన్నిటా నీవు మన్నించరాదా తలఁపుదెలిసి నన్ను దయఁజూచి యేలితివి యెలమి శ్రీవేంకటేశ యాకెనూఁ గూడరాదా English(||pallavi||) nā mŏgamu sūsi yemi navvulu navvevu nīvu yī maṟam̐gu līḍerĕ nĕṁta sesevu (||nāmŏ||) sittarubadimavalĕ sĕli nilusugunnadi hatti daṁḍam̐ gūsuṁḍu manam̐garādā battisesi nīgu nadĕ bāgā laṁdiichchīni kŏttavalabu nīvaṁdugŏnam̐garādā (||nāmŏ||) menamaṟam̐dali valĕ mĕluda sarasamāḍī vīnulu sallam̐gā nīvu vinam̐garādā ānuga gubbala nīgu nāsa sūbugavunnadi penibaṭṭi vām̐ṭidoḍam̐ bĕnam̐garādā (||nāmŏ||) valarārajudallivalĕ vanida nīgum̐ galigĕ malasi yanniḍā nīvu manniṁcharādā talam̐pudĕlisi nannu dayam̐jūsi yelidivi yĕlami śhrīveṁkaḍeśha yāgĕnūm̐ gūḍarādā