Title (Indic)నా మొగమోటములే నన్ను నింత సేసీఁగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మొగమోటములే నన్ను నింత సేసీఁగాక యేమి సేసినా నీవు యిన్నిటికిఁ దగవా (॥నామొ॥) అందరునిదెంత కల్లరనేరంటా నాకు నాకే విందుల నీమాటలెల్లా వింటిఁగాక మందలించి నీవు నిన్న మాయింటికి రానప్పుడే సందడి నే నిన్నుఁ బగ సాదించఁ జెల్లదా (॥నామొ॥) ఆఁటదానికింతయేల అని నే విచారించి గాఁటపు నీ వినయాలు కైకొంటిఁగాక వాఁటపు నీమేని చిందువందులు చూచినపుడే యీటున నిన్నిన్నిటాను యేఁప నాకుఁ జెల్లదా (॥నామొ॥) కూడినచోటనింకేల గోరపెట్టనని నేనే వోడక నిన్నుఁ గలసి వుంటిఁ గాక యీడనే శ్రీవేంకటేశ యింత నీవు సేసినందు- కాడనీడన సుద్దులన్నీఁ జెప్పఁ జెల్లదా English(||pallavi||) nā mŏgamoḍamule nannu niṁta sesīm̐gāga yemi sesinā nīvu yinniḍigim̐ dagavā (||nāmŏ||) aṁdarunidĕṁta kallaraneraṁṭā nāgu nāge viṁdula nīmāḍalĕllā viṁṭim̐gāga maṁdaliṁchi nīvu ninna māyiṁṭigi rānappuḍe saṁdaḍi ne ninnum̐ baga sādiṁcham̐ jĕlladā (||nāmŏ||) ām̐ṭadānigiṁtayela ani ne visāriṁchi gām̐ṭabu nī vinayālu kaigŏṁṭim̐gāga vām̐ṭabu nīmeni siṁduvaṁdulu sūsinabuḍe yīḍuna ninninniḍānu yem̐pa nāgum̐ jĕlladā (||nāmŏ||) kūḍinasoḍaniṁkela gorabĕṭṭanani nene voḍaga ninnum̐ galasi vuṁṭim̐ gāga yīḍane śhrīveṁkaḍeśha yiṁta nīvu sesinaṁdu- kāḍanīḍana suddulannīm̐ jĕppam̐ jĕlladā