Title (Indic)నా మొగ మేమి చూచేవు నడుమనే యిది యేమే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మొగ మేమి చూచేవు నడుమనే యిది యేమే గామిడివై సాదించఁగలవా నీవూ (॥నామొగ॥) కాతరించి పెనఁగేవు కవ కవ నవ్వేవు ఆతఁడేడ నీవేడ అవునే నీవు చేతులారా నీడుగాని చేఁతలు సేసితేను నాతులెల్లా నిన్నుఁ జూచి నవ్వరా యిందరును (॥నామొగ॥) సరుసఁ గూచుండేవు సరసము లాడేవు దొరతోడి పొందు కోపుదువటె నీవు యరవుల వారితోడ యెమ్మెలు చెప్పుకొంటేను సరి సవతు లెల్లాను జాతులు సేయరా (॥నామొగ॥) చిమ్ముచు గోర నూఁదేవు సేసలు పైఁ జల్లేవు నెమ్మి మగనిఁ జొక్కించ నేర్తువా నీవు యిమ్ముల శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్నుఁ గూడె పమ్ముక మీ యింటివారే పంగించరా నిన్నును English(||pallavi||) nā mŏga memi sūsevu naḍumane yidi yeme gāmiḍivai sādiṁcham̐galavā nīvū (||nāmŏga||) kādariṁchi pĕnam̐gevu kava kava navvevu ādam̐ḍeḍa nīveḍa avune nīvu sedulārā nīḍugāni sem̐talu sesidenu nādulĕllā ninnum̐ jūsi navvarā yiṁdarunu (||nāmŏga||) sarusam̐ gūsuṁḍevu sarasamu lāḍevu dŏradoḍi pŏṁdu kobuduvaḍĕ nīvu yaravula vāridoḍa yĕmmĕlu sĕppugŏṁṭenu sari savadu lĕllānu jādulu seyarā (||nāmŏga||) simmusu gora nūm̐devu sesalu paim̐ jallevu nĕmmi maganim̐ jŏkkiṁcha nerduvā nīvu yimmula śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ pammuga mī yiṁṭivāre paṁgiṁcharā ninnunu