Title (Indic)నా మర్మమిట్టిది యిఁక నీ మర్మమానతీరా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మర్మమిట్టిది యిఁక నీ మర్మమానతీరా యీ మేరఁ జూచినవారి కెంతబంటోయిఁకను (॥నామ॥) మక్కువ నీతో నేను మాటలాడినంతలోనే పుక్కిటిబంటె(టా?) యరా పూఁచి వలపు చెక్కుల చెమటలెల్లా చెరువుల వానలాయ యిక్కడ నన్నుఁ జూచి నీకెంతబంటో యిఁకను (॥నామ॥) కన్నుల నీరూపుచూచి కరఁగి గుండెలుమోఁచి చన్నులబంటె(టా?)యరా సరివలపు వున్నతిఁ మోవితేనియ లువ్విళ్లూరఁగఁ జొచ్చె యిన్నిటా నా జోడైతి వెంతబంటోయిఁకను (॥నామ॥) కలసి నీవద్ద నేను గట్టిపీఁటపై గూచుండి మొలబంటియాయరా యిమ్ములవలపు కులికి శ్రీవెంకటేశ కూడితివి వయోమద మెలిమి మడుగులుబ్బె నెంతబంటోయిఁకను English(||pallavi||) nā marmamiṭṭidi yim̐ka nī marmamānadīrā yī meram̐ jūsinavāri kĕṁtabaṁṭoyim̐kanu (||nāma||) makkuva nīdo nenu māḍalāḍinaṁtalone pukkiḍibaṁṭĕ(ṭā?) yarā pūm̐si valabu sĕkkula sĕmaḍalĕllā sĕruvula vānalāya yikkaḍa nannum̐ jūsi nīgĕṁtabaṁṭo yim̐kanu (||nāma||) kannula nīrūbusūsi karam̐gi guṁḍĕlumom̐si sannulabaṁṭĕ(ṭā?)yarā sarivalabu vunnadim̐ movideniya luvviḽlūram̐gam̐ jŏchchĕ yinniḍā nā joḍaidi vĕṁtabaṁṭoyim̐kanu (||nāma||) kalasi nīvadda nenu gaṭṭibīm̐ṭabai gūsuṁḍi mŏlabaṁṭiyāyarā yimmulavalabu kuligi śhrīvĕṁkaḍeśha kūḍidivi vayomada mĕlimi maḍugulubbĕ nĕṁtabaṁṭoyim̐kanu