Title (Indic)నా మనసెఱుఁగు దొల్లె ననిచినదానౌత WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మనసెఱుఁగు దొల్లె ననిచినదానౌత కామించి యేఁచఁగవద్దు గక్కన రమ్మనవే (॥నామ॥) యెడమాట లాడించి యెంతపొద్దు జరపీనే అడియాసలనే యెంత అలయించీనే వుడివోనిచూపులను వురులొడ్డీ నిది యేమే చిడియనివలపులఁ జిమ్మిరేఁగేదానను (॥నామ॥) మొగమొగా లెదుటను మోహ మెంతరేఁచీనే నగవునఁ గాఁక లెట్టు నటియించీనే పగటుఁజేఁతలు చూపి బయలేల యీఁదించీనే మిగులాఁ దమకముల మించివున్నదానను (॥నామ॥) మన్ననలు నాకు విచ్చి మద మెంత యెక్కించీనే కన్నుసన్నలనే యేమి గారవించీనే వున్నది శ్రీవేంకటేశు డుద్దగిరికృష్ణుఁడై నన్నుఁ గూడె తనపొందు నమ్మికైనదానను English(||pallavi||) nā manasĕṟum̐gu dŏllĕ nanisinadānauda kāmiṁchi yem̐sam̐gavaddu gakkana rammanave (||nāma||) yĕḍamāḍa lāḍiṁchi yĕṁtabŏddu jarabīne aḍiyāsalane yĕṁta alayiṁchīne vuḍivonisūbulanu vurulŏḍḍī nidi yeme siḍiyanivalabulam̐ jimmirem̐gedānanu (||nāma||) mŏgamŏgā lĕduḍanu moha mĕṁtarem̐sīne nagavunam̐ gām̐ka lĕṭṭu naḍiyiṁchīne pagaḍum̐jem̐talu sūbi bayalela yīm̐diṁchīne migulām̐ damagamula miṁchivunnadānanu (||nāma||) mannanalu nāgu vichchi mada mĕṁta yĕkkiṁchīne kannusannalane yemi gāraviṁchīne vunnadi śhrīveṁkaḍeśhu ḍuddagirikṛṣhṇum̐ḍai nannum̐ gūḍĕ tanabŏṁdu nammigainadānanu