Title (Indic)నా మన సేమిచూచేరే నడుమ నో చెలులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా మన సేమిచూచేరే నడుమ నో చెలులాల ఆముకొని నా విభుని ఆత్మలో నుందానను (॥నామ॥) ప్రేమముగలవనిత ప్రియములు చెప్పుఁగాక యేమైన రమణుని కెదురాడునా కామించి వచ్చినది కడుబత్తిసేసుఁగాక సామాన్యపుఁబనులకు సాదించునా (॥నామ॥) తగుచుట్టమైనది తలఁపులో వచ్చుఁగాక వెగటుగా నడచిన వేసారునా నగ వెరిఁగినది మిన్నక ఇయ్యకొనుఁగాక యెగసక్కెమాడినా యీసడించునా (॥నామ॥) కడువితవరైతేను కాఁగిటఁ జొక్కించుఁగాక యెడసినతప్పులెల్లా నెంచుకొనునా బడి నలమేల్మంగను పతి శ్రీవేంకటేశుఁడు తడయక నన్నేలేవింతటి గోరకుండు నా English(||pallavi||) nā mana semisūsere naḍuma no sĕlulāla āmugŏni nā vibhuni ātmalo nuṁdānanu (||nāma||) premamugalavanida priyamulu sĕppum̐gāga yemaina ramaṇuni kĕdurāḍunā kāmiṁchi vachchinadi kaḍubattisesum̐gāga sāmānyabum̐banulagu sādiṁchunā (||nāma||) tagusuṭṭamainadi talam̐pulo vachchum̐gāga vĕgaḍugā naḍasina vesārunā naga vĕrim̐ginadi minnaga iyyagŏnum̐gāga yĕgasakkĕmāḍinā yīsaḍiṁchunā (||nāma||) kaḍuvidavaraidenu kām̐giḍam̐ jŏkkiṁchum̐gāga yĕḍasinadappulĕllā nĕṁchugŏnunā baḍi nalamelmaṁganu padi śhrīveṁkaḍeśhum̐ḍu taḍayaga nanneleviṁtaḍi goraguṁḍu nā