Title (Indic)నా కేల నేరుపవచ్చినాఁడు తాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా కేల నేరుపవచ్చినాఁడు తాను చేకొని యెప్పుడుఁ దనచిత్తములో దానను (॥నాకేల॥) తగవులఁ బెట్టేది తరితీపు సేసేది మగనాలిసేఁతలా మాపుదాఁకాను వెగటుగా నవ్వేది వెంగెముతో నుండేది అగడు సేసేటివెలయాండ్లకుఁ గాక (॥నాకేల॥) పల్లదాన సొలసేది పంతములు మెరసేది యీల్లాలివిద్యలు యివి యల్లాను వెల్లివిరై చెనకేది వేమారుఁ బెనఁగేది చిల్లరసాధారణపుచెలులకుఁ గాక (॥నాకేల॥) వరుసకు బిలిచేది వాడికేలు చూపేది గరితెలగుణమా కను గొంటేను యిరవై శ్రీవేంకటేశు డే నలమేల్మంగను సరి గూడె నితరాలు జారులే కాకా English(||pallavi||) nā kela nerubavachchinām̐ḍu tānu segŏni yĕppuḍum̐ danasittamulo dānanu (||nāgela||) tagavulam̐ bĕṭṭedi taridību sesedi maganālisem̐talā mābudām̐kānu vĕgaḍugā navvedi vĕṁgĕmudo nuṁḍedi agaḍu seseḍivĕlayāṁḍlagum̐ gāga (||nāgela||) palladāna sŏlasedi paṁtamulu mĕrasedi yīllālividyalu yivi yallānu vĕllivirai sĕnagedi vemārum̐ bĕnam̐gedi sillarasādhāraṇabusĕlulagum̐ gāga (||nāgela||) varusagu bilisedi vāḍigelu sūbedi garidĕlaguṇamā kanu gŏṁṭenu yiravai śhrīveṁkaḍeśhu ḍe nalamelmaṁganu sari gūḍĕ nidarālu jārule kāgā