Title (Indic)నా కన్నిచేఁత లెల్ల నాయకుఁడ యియ్యకోలె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా కన్నిచేఁత లెల్ల నాయకుఁడ యియ్యకోలె యీ కడ నీ వేడుక యీడేరితేఁ జాలును (॥నాకన్ని॥) దాపుగా వారింటఁ గాని దగ్గరి మాయింటఁ గాని వోపికతో నీవు లెస్స వుంటేఁ జాలు ఆపెవద్దఁ గాని అట్టె నావద్దఁ గాని తీపు లైన నీముచ్చట తీరితేఁ జాలును (॥నాకన్ని॥) అతివచేతనె కాని అట్టె నాచేతఁ గాని యితవుగా నీవు భూజియించితేఁ జాలు సతమై యాపెతోఁ గాని జట్టిగా నాతోఁ గాని బతిమివట్టినట్లాఁ బాయకుంటేఁ జాలును (॥నాకన్ని॥) అలయింతిరతిఁ గాని అట్టె నారతిఁ గాని చెలువమై నీసుఖము చెల్లితేఁ జాలు చెలరేఁగి యిద్దరిని శ్రీవెంకటనాథుఁడ చలపట్టి కూడితిగా సత మైతేఁ జాలును. English(||pallavi||) nā kannisem̐ta lĕlla nāyagum̐ḍa yiyyagolĕ yī kaḍa nī veḍuga yīḍeridem̐ jālunu (||nāganni||) dābugā vāriṁṭam̐ gāni daggari māyiṁṭam̐ gāni vobigado nīvu lĕssa vuṁṭem̐ jālu ābĕvaddam̐ gāni aṭṭĕ nāvaddam̐ gāni tību laina nīmuchchaḍa tīridem̐ jālunu (||nāganni||) adivasedanĕ kāni aṭṭĕ nāsedam̐ gāni yidavugā nīvu bhūjiyiṁchidem̐ jālu sadamai yābĕdom̐ gāni jaṭṭigā nādom̐ gāni badimivaṭṭinaṭlām̐ bāyaguṁṭem̐ jālunu (||nāganni||) alayiṁtiradim̐ gāni aṭṭĕ nāradim̐ gāni sĕluvamai nīsukhamu sĕllidem̐ jālu sĕlarem̐gi yiddarini śhrīvĕṁkaḍanāthum̐ḍa salabaṭṭi kūḍidigā sada maidem̐ jālunu.