Title (Indic)మొగమోట లేక యెంత మోవనాడేవయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మొగమోట లేక యెంత మోవనాడేవయ్య మగువ బీరము నీకు మంచిది గాదా (॥॥) చెలికత్తెయైనది చేయి వట్టి తీసితేను బలిమి చూపె నందురా పంతగాఁడవు మొలక చన్నులఁ గొంత మొనలు దాఁకించితేను కలికి తనాల దిది గబ్బి యందురా (॥॥) బత్తి గలది గొంత పక పక నవ్వితేను హత్తి మందె మేళ మెంత అందురా నీవు కొత్తగొత్త మాటలను కూరిమి గొసరితేను తత్తరపు కతకారితనము లందురా (॥॥) పట్టపు దేవులైనది పై కొని కౌఁగిలించితే గట్టు వా యందురా కాంతలలోను అట్టే శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె చుట్టమై నిన్నుఁగూడె జూటరి దందురా English(||pallavi||) mŏgamoḍa lega yĕṁta movanāḍevayya maguva bīramu nīgu maṁchidi gādā (||||) sĕligattĕyainadi seyi vaṭṭi tīsidenu balimi sūbĕ naṁdurā paṁtagām̐ḍavu mŏlaga sannulam̐ gŏṁta mŏnalu dām̐kiṁchidenu kaligi tanāla didi gabbi yaṁdurā (||||) batti galadi gŏṁta paga paga navvidenu hatti maṁdĕ meḽa mĕṁta aṁdurā nīvu kŏttagŏtta māḍalanu kūrimi gŏsaridenu tattarabu kadagāridanamu laṁdurā (||||) paṭṭabu devulainadi pai kŏni kaum̐giliṁchide gaṭṭu vā yaṁdurā kāṁtalalonu aṭṭe śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ suṭṭamai ninnum̐gūḍĕ jūḍari daṁdurā