Title (Indic)మోపుల చిగురుల చిమ్ముల వేదము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మోపుల చిగురుల చిమ్ముల వేదము ఆవుల మందలలోని ఆ వేదము (॥మోపుల॥) మంచముపైఁ జదివేది మరవకుమీ కొంచెపు లేఁబలుకుల కొనవేదము పించెపు శిరసుతోడఁ బిన్ననాఁడే చదివిన తుంచి తుంచిన మాటల తొలువేదము (॥మోపుల॥) చల్లలమ్మే గొల్లెతల చక్కనిజంకెనలకు గొల్లపల్లెలోన దొరకొన్న వేదము తల్లిబిడ్డలనక యందరినొక్కవావిగా పిల్లఁ గోవి నేరిపిన పెనువేదము (॥మోపుల॥) పంకజభవాదుల బడిబడిఁ జదివించే లంకెలు చెలఁగిన మేలపువేదము వేంకటనగముమీఁద వెలయ నిందిరఁగూడి కొంకక చదివిన చొక్కుల వేదము English(||pallavi||) mobula sigurula simmula vedamu āvula maṁdalaloni ā vedamu (||mobula||) maṁchamubaim̐ jadivedi maravagumī kŏṁchĕbu lem̐balugula kŏnavedamu piṁchĕbu śhirasudoḍam̐ binnanām̐ḍe sadivina tuṁchi tuṁchina māḍala tŏluvedamu (||mobula||) sallalamme gŏllĕdala sakkanijaṁkĕnalagu gŏllaballĕlona dŏragŏnna vedamu tallibiḍḍalanaga yaṁdarinŏkkavāvigā pillam̐ govi neribina pĕnuvedamu (||mobula||) paṁkajabhavādula baḍibaḍim̐ jadiviṁche laṁkĕlu sĕlam̐gina melabuvedamu veṁkaḍanagamumīm̐da vĕlaya niṁdiram̐gūḍi kŏṁkaga sadivina sŏkkula vedamu