Title (Indic)మెచ్చిరి గొల్లెతలెల్ల మీఁద మీఁదను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మెచ్చిరి గొల్లెతలెల్ల మీఁద మీఁదను యిచ్చిరి చనవులు నీవిట్టే బతుకవయ్యా (॥మెచ్చి॥) అంగనలైతేఁ జాలు నట్టే దయ దలఁతువు యెంగిలి మోవులని యెంచవు కంగులే కెప్పుడు మెడఁగట్టుకొనే వుందువు యింగితపురతులు నీకేమి గడమయ్యా (॥మెచ్చి॥) వెలఁదులైతేఁ జాలు వేడుకఁ బెండ్లాడుదువు పొలసి వారేమిచ్చినాఁ బూసుకొందువు నెలకొని యేపొద్దు నెత్తిఁ బెట్టుకొందువు వలపులనోము నీకు ఫలియించె నయ్యా (॥మెచ్చి॥) మానినులై తేఁ జాలు మర్మములు చూతువు ఆనుక వీఁపున మోచు కలరుదువు నే నలమేలుమంగను నీవు శ్రీవేంకటేశుఁడ- వీనిజాన నిన్నుఁ గూడితింక నేలుకోవయ్యా English(||pallavi||) mĕchchiri gŏllĕdalĕlla mīm̐da mīm̐danu yichchiri sanavulu nīviṭṭe badugavayyā (||mĕchchi||) aṁganalaidem̐ jālu naṭṭe daya dalam̐tuvu yĕṁgili movulani yĕṁchavu kaṁgule kĕppuḍu mĕḍam̐gaṭṭugŏne vuṁduvu yiṁgidaburadulu nīgemi gaḍamayyā (||mĕchchi||) vĕlam̐dulaidem̐ jālu veḍugam̐ bĕṁḍlāḍuduvu pŏlasi vāremichchinām̐ būsugŏṁduvu nĕlagŏni yebŏddu nĕttim̐ bĕṭṭugŏṁduvu valabulanomu nīgu phaliyiṁchĕ nayyā (||mĕchchi||) māninulai tem̐ jālu marmamulu sūduvu ānuga vīm̐puna mosu kalaruduvu ne nalamelumaṁganu nīvu śhrīveṁkaḍeśhum̐ḍa- vīnijāna ninnum̐ gūḍidiṁka nelugovayyā