Title (Indic)మన్నించీఁ బదారువేల మగఁడు తాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మన్నించీఁ బదారువేల మగఁడు తాను నిన్ననేఁటి పడుచను నేనేమి బాఁతే (॥మన్నిం॥) చెక్కు నొక్కి బుజ్జగించి చేతిమీఁదఁ జేయివేసి యిక్కువ లంటీ నేఁదన కేమిబాఁతే చక్కనిదాననంటా జవ్వనపుదాననంటా నెక్కొని పొగడీ నిదే నే నేమిఁబాఁతే (॥మన్ని॥) పచ్చిదేర మాఁటలాడి పాపట దువ్వి దువ్వి యిచ్చె వీడెము నాకు నే నేమిబాఁతే యిచ్చకముదాననంటా నితవరిదాననంటాఁ నిచ్చలు నన్నుఁబాయఁడు నే నేమిబాఁతే (॥మన్ని॥) చుట్టరికములు చెప్పి సొమ్ములెల్లా నాకుఁబెట్టి యిట్టె నన్నుఁగూడీ నే నేమిబాఁతే ముట్టి శ్రీవేంకటేశుఁడిమ్ముల మేలుదాననంటా నెట్టన నన్నుఁబెండ్లాడీ నే నేమిబాఁతే English(||pallavi||) manniṁchīm̐ badāruvela magam̐ḍu tānu ninnanem̐ṭi paḍusanu nenemi bām̐te (||manniṁ||) sĕkku nŏkki bujjagiṁchi sedimīm̐dam̐ jeyivesi yikkuva laṁṭī nem̐dana kemibām̐te sakkanidānanaṁṭā javvanabudānanaṁṭā nĕkkŏni pŏgaḍī nide ne nemim̐bām̐te (||manni||) pachchidera mām̐ṭalāḍi pābaḍa duvvi duvvi yichchĕ vīḍĕmu nāgu ne nemibām̐te yichchagamudānanaṁṭā nidavaridānanaṁṭām̐ nichchalu nannum̐bāyam̐ḍu ne nemibām̐te (||manni||) suṭṭarigamulu sĕppi sŏmmulĕllā nāgum̐bĕṭṭi yiṭṭĕ nannum̐gūḍī ne nemibām̐te muṭṭi śhrīveṁkaḍeśhum̐ḍimmula meludānanaṁṭā nĕṭṭana nannum̐bĕṁḍlāḍī ne nemibām̐te