Title (Indic)మంటలంటా బెదరీని మాణిక్యాలు చూచి చెలి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మంటలంటా బెదరీని మాణిక్యాలు చూచి చెలి యింటిలోనూ నెరవాయె నేమి సేతమే (॥మంట॥) నిండుఁబరితాపమున నీలపుమణులమేడ నుండరాక దేహమెల్ల నుమ్మగించంగా పండు వెన్నెలల మంచిబయట నిలిచిచెలి యెండనవి తల్లడించె నేమిసేతమే (॥మంట॥) గ్రక్కనఁ జెలులుచేరి కప్పురపు బాగాలు చెక్కువట్టి కదలించి చేతి కియ్యంగా పొక్కుచుఁ జెలులఁ గన్ను బొమ్మలవిండ్లఁగోప మెక్కువట్టి యేయ జూచి నేమిసేతమే (॥మంట॥) పాయక వేంకటపతి పచ్చఁబట్టు ముసుఁగులో సోయగపు రతులను చొక్కుచునుండి రాయడి నెవ్వతె పసపాయెనో పచ్చడమని యేయెడ నైఁనా దూరే నేమిసేతమే English(||pallavi||) maṁṭalaṁṭā bĕdarīni māṇikyālu sūsi sĕli yiṁṭilonū nĕravāyĕ nemi sedame (||maṁṭa||) niṁḍum̐baridābamuna nīlabumaṇulameḍa nuṁḍarāga dehamĕlla nummagiṁchaṁgā paṁḍu vĕnnĕlala maṁchibayaḍa nilisisĕli yĕṁḍanavi tallaḍiṁchĕ nemisedame (||maṁṭa||) grakkanam̐ jĕluluseri kappurabu bāgālu sĕkkuvaṭṭi kadaliṁchi sedi kiyyaṁgā pŏkkusum̐ jĕlulam̐ gannu bŏmmalaviṁḍlam̐goba mĕkkuvaṭṭi yeya jūsi nemisedame (||maṁṭa||) pāyaga veṁkaḍabadi pachcham̐baṭṭu musum̐gulo soyagabu radulanu sŏkkusunuṁḍi rāyaḍi nĕvvadĕ pasabāyĕno pachchaḍamani yeyĕḍa naim̐nā dūre nemisedame