Title (Indic)మాకు నీవు వెఱచేవా మాటమాటలా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకు నీవు వెఱచేవా మాటమాటలా ఆకెఁ బేరుకొనియైనా నానందించేవు గాక (॥మాకు॥) తెలతెలవారఁగానే తెఱవమొగముచూచి వలపు చద్ది గట్టుక వచ్చితివి చలాన నే నలిగితే జడిసేనా నీవేమైనా తలపోఁతనైనాఁ గొంత తనుతువుగాక (॥మాకు॥) పానుపు దిగుతా నీవు భామమోవి చవిచూచి తేనెతావులు దప్పికిఁ దెచ్చుకొంటివి పూని నేఁ బిలువకుంటే పొగిలేవా నీవేమైనా దానియాసాసలనైనాఁ దనుతువుగాక (॥మాకు॥) కన్నులు దెఱచుతానే కాఁగిటిలో నాకెఁ గూడి అన్నిటా రతిసంబళా లందుకొంటివి యెన్నఁగ శ్రీవేంకటేశ యెడసేవా నీవేమైనా తన్నూ నన్నూఁ గూడితివి తనుతువుగాయ English(||pallavi||) māgu nīvu vĕṟasevā māḍamāḍalā āgĕm̐ berugŏniyainā nānaṁdiṁchevu gāga (||māgu||) tĕladĕlavāram̐gāne tĕṟavamŏgamusūsi valabu saddi gaṭṭuga vachchidivi salāna ne naligide jaḍisenā nīvemainā talabom̐tanainām̐ gŏṁta tanuduvugāga (||māgu||) pānubu digudā nīvu bhāmamovi savisūsi tenĕdāvulu dappigim̐ dĕchchugŏṁṭivi pūni nem̐ biluvaguṁṭe pŏgilevā nīvemainā dāniyāsāsalanainām̐ danuduvugāga (||māgu||) kannulu dĕṟasudāne kām̐giḍilo nāgĕm̐ gūḍi anniḍā radisaṁbaḽā laṁdugŏṁṭivi yĕnnam̐ga śhrīveṁkaḍeśha yĕḍasevā nīvemainā tannū nannūm̐ gūḍidivi tanuduvugāya