Title (Indic)మా తోడి గొడవేల మాపు దాఁకా నీకును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా తోడి గొడవేల మాపు దాఁకా నీకును యీతలఁ జింతనసేయు మింకా నీ విపుడు (॥మాతో॥) చెలరేఁగి యాపె నీకుఁ జెప్పిన బుద్దులెల్లా తలఁచి తలఁచి నీకు దాఁటరాదుగా చలమున నాపె నీకు చదివించినవొజ్జలు నెలవుల యిఁకఁ గొన్ని నేరుచుకో ఇపుడు (॥మాతో॥) వొద్దనుండి యాపె నీకు వుపదేశించినదెల్లా తిద్దరానివేదములై తిరమాయఁగా పొద్దు వొద్దు నీకు నాపె బోదించిన గురువు సుద్దులెల్లా మరవక చొక్కుము నీవిపుడు (॥మాతో॥) చెక్కు నొక్కి కూడి యాపె నేసినట్టి విన్నపాలు చక్కనై మదనరహస్యములాయఁగా యిక్కువ శ్రీ వేంకటేశ యెనసితి విటునన్ను తక్క కాపె అప్పణించె దైవము నీకిపుడు English(||pallavi||) mā toḍi gŏḍavela mābu dām̐kā nīgunu yīdalam̐ jiṁtanaseyu miṁkā nī vibuḍu (||mādo||) sĕlarem̐gi yābĕ nīgum̐ jĕppina buddulĕllā talam̐si talam̐si nīgu dām̐ṭarādugā salamuna nābĕ nīgu sadiviṁchinavŏjjalu nĕlavula yim̐kam̐ gŏnni nerusugo ibuḍu (||mādo||) vŏddanuṁḍi yābĕ nīgu vubadeśhiṁchinadĕllā tiddarānivedamulai tiramāyam̐gā pŏddu vŏddu nīgu nābĕ bodiṁchina guruvu suddulĕllā maravaga sŏkkumu nīvibuḍu (||mādo||) sĕkku nŏkki kūḍi yābĕ nesinaṭṭi vinnabālu sakkanai madanarahasyamulāyam̐gā yikkuva śhrī veṁkaḍeśha yĕnasidi viḍunannu takka kābĕ appaṇiṁchĕ daivamu nīgibuḍu