Title (Indic)మా కెల్ల 'రాజానుమతో ధర్మ' యిది నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా కెల్ల 'రాజానుమతో ధర్మ' యిది నీ- యీకడఁ గలుగుట కేమరుదు (॥మా కెల్ల॥) అలగరుడగమన మహిశయనంబును కలిసి నీయందె కలిగెనటా పొలసినపాపముఁ బుణ్యము నరులకు యెలమి గలుగుటకు నేమరుదు (॥మా కెల్ల॥) యిదె నీడకన్ను యెండకన్ను మరి కదిసి నీయందె కలిగెనట సదరపునరులకు జననమరణములు యెదురనె కలుగుట కేమరుదు (॥మా కెల్ల॥) శ్రీకాంత ఒకదెస భూకాంత ఒకదెస కదెన కైకొని నీకిటు గలిగెనట యీకడ శ్రీవేంకటేశ యిహపరము యేకమై మా కగు టేమరుదు English(||pallavi||) mā kĕlla 'rājānumado dharma' yidi nī- yīgaḍam̐ galuguḍa kemarudu (||mā kĕlla||) alagaruḍagamana mahiśhayanaṁbunu kalisi nīyaṁdĕ kaligĕnaḍā pŏlasinabābamum̐ buṇyamu narulagu yĕlami galuguḍagu nemarudu (||mā kĕlla||) yidĕ nīḍagannu yĕṁḍagannu mari kadisi nīyaṁdĕ kaligĕnaḍa sadarabunarulagu jananamaraṇamulu yĕduranĕ kaluguḍa kemarudu (||mā kĕlla||) śhrīgāṁta ŏgadĕsa bhūgāṁta ŏgadĕsa kadĕna kaigŏni nīgiḍu galigĕnaḍa yīgaḍa śhrīveṁkaḍeśha yihabaramu yegamai mā kagu ṭemarudu