Title (Indic)లోకపు నీ చేఁతలకు లోనే కాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లోకపు నీ చేఁతలకు లోనే కాదా నీకు మారుకొనియుండ నేరుపా నాకు (॥లోకపు॥) వుడివోని జవ్వనము వొడిఁగట్టుకొని నీతో సడిఁబెట్టి యలుగఁగ సంగతే నాకు చిడిముడి కోరికలు చిత్తములో నుండఁగాను తడసి నిన్నుఁ బాయఁగ తగునా నాకు (॥లోకపు॥) వుప్పతిల్లుఁ జన్నులు వురమున మోచుకొని చిప్పిల నీనేరా లెంచఁ జెల్లునా నాకు ముప్పిరి మొగమోటలు మోముమీఁద నుండఁగాను అప్పుడే నిన్నణకించ ననువా నాకు (॥లోకపు॥) నిండుకొన్నజవ్వనము నిలువునఁ బెట్టుకొని చండసేసి పెన గఁగ సరవే నాకు అండనే శ్రీవేంకటేశ అంతలో న న్నేలితివి అండు కాచి దూరఁ దగ వవునా నాకు English(||pallavi||) logabu nī sem̐talagu lone kādā nīgu mārugŏniyuṁḍa nerubā nāgu (||logabu||) vuḍivoni javvanamu vŏḍim̐gaṭṭugŏni nīdo saḍim̐bĕṭṭi yalugam̐ga saṁgade nāgu siḍimuḍi korigalu sittamulo nuṁḍam̐gānu taḍasi ninnum̐ bāyam̐ga tagunā nāgu (||logabu||) vuppadillum̐ jannulu vuramuna mosugŏni sippila nīnerā lĕṁcham̐ jĕllunā nāgu muppiri mŏgamoḍalu momumīm̐da nuṁḍam̐gānu appuḍe ninnaṇagiṁcha nanuvā nāgu (||logabu||) niṁḍugŏnnajavvanamu niluvunam̐ bĕṭṭugŏni saṁḍasesi pĕna gam̐ga sarave nāgu aṁḍane śhrīveṁkaḍeśha aṁtalo na nnelidivi aṁḍu kāsi dūram̐ daga vavunā nāgu