Title (Indic)లలితాంగి యౌవనము లావణ్యముల ప్రోవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లలితాంగి యౌవనము లావణ్యముల ప్రోవు అలరి యిటువలెఁ జేసెనమ్మా (॥లలితా॥) జవ్వాది మిగుల నుష్ణము మీఁద సంపంగి పువ్వు గట్టినది గన పొదలెఁ దాపంబు నివ్వటిలు గొజ్జంగి నీట నొయ్యన కడిగి దువ్వటపుఁ బయ్యెదను దుడువరమ్మా! (॥లలితా॥) మృగమదము గడు వేఁడి మెలుఁత తలపట్టునకు అగలు గూడఁగ వేద నగ్గలంబాయ బిగువైన కస్తూరి బేం ట్లొయ్యనగోరి నగలించి తట్టుపునుఁ గంటరమ్మా (॥లలితా॥) విరహతాపంబునకు వేరొండు గతిలేదు పొరసి వేగించినాఁ బోదు తిరువేంకటాచలాధిపుని మన్ననఁ గాని అరిది మోహము దీరదమ్మా! English(||pallavi||) lalidāṁgi yauvanamu lāvaṇyamula provu alari yiḍuvalĕm̐ jesĕnammā (||lalidā||) javvādi migula nuṣhṇamu mīm̐da saṁpaṁgi puvvu gaṭṭinadi gana pŏdalĕm̐ dābaṁbu nivvaḍilu gŏjjaṁgi nīḍa nŏyyana kaḍigi duvvaḍabum̐ bayyĕdanu duḍuvarammā! (||lalidā||) mṛgamadamu gaḍu vem̐ḍi mĕlum̐ta talabaṭṭunagu agalu gūḍam̐ga veda naggalaṁbāya biguvaina kastūri beṁ ṭlŏyyanagori nagaliṁchi taṭṭubunum̐ gaṁṭarammā (||lalidā||) virahadābaṁbunagu verŏṁḍu gadiledu pŏrasi vegiṁchinām̐ bodu tiruveṁkaḍāsalādhibuni mannanam̐ gāni aridi mohamu dīradammā!