Title (Indic)కొత్తపెండ్లికూఁతురవై గుట్టుసేసుకోవు గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కొత్తపెండ్లికూఁతురవై గుట్టుసేసుకోవు గాక మత్తిలి నీ మగఁడట మరి యేమి సేసునే (॥॥) పంతమాడి యాతఁడు నీపాదము దొక్కీనంటాను చెంతనున్న చెలులతోఁ జెప్పుదురటె మంతనాన నీచన్నులు మళ్లిమళ్లి చూచీనంటాఁ నింతలో సాకిరివెట్టే విదియేమే నీవు (॥॥) నేరుపుతోఁ దానప్పటి నీతో నవ్వీనంటా పేరుకొని నీదాదిఁ బిలుతురటే చేరిచేరి చేయిముట్టి చెనకవచ్చీనంటా బీరముతో నానలు పెట్టేవేమే నీవు (॥॥) అరుదై శ్రీ వేంకటేశుఁ డట్టే నిన్నుఁ గూడీనంటా సొరిది చిలుకలకుఁ జూపుదురటే వురముపై నేపొద్దునుండే యలమేల్మంగవు బెరసి మాకు విడేలు పెట్టేవేమే నీవు English(||pallavi||) kŏttabĕṁḍligūm̐turavai guṭṭusesugovu gāga mattili nī magam̐ḍaḍa mari yemi sesune (||||) paṁtamāḍi yādam̐ḍu nībādamu dŏkkīnaṁṭānu sĕṁtanunna sĕluladom̐ jĕppuduraḍĕ maṁtanāna nīsannulu maḽlimaḽli sūsīnaṁṭām̐ niṁtalo sāgirivĕṭṭe vidiyeme nīvu (||||) nerubudom̐ dānappaḍi nīdo navvīnaṁṭā perugŏni nīdādim̐ biluduraḍe seriseri seyimuṭṭi sĕnagavachchīnaṁṭā bīramudo nānalu pĕṭṭeveme nīvu (||||) arudai śhrī veṁkaḍeśhum̐ ḍaṭṭe ninnum̐ gūḍīnaṁṭā sŏridi silugalagum̐ jūbuduraḍe vuramubai nebŏddunuṁḍe yalamelmaṁgavu bĕrasi māgu viḍelu pĕṭṭeveme nīvu