Title (Indic)కూరుములూఁ గొసరేవు గుంపెనలూఁ జూపేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కూరుములూఁ గొసరేవు గుంపెనలూఁ జూపేవు ఆరితేరినదానవు ఆయా లంట రాదా (॥కూరు॥) చనవుగలదానవు సణఁగులు రాల్చనేలే చెనకరాదా విభునిఁ జేతులారాను వినయపు దానవు వెంగెము లాడనేలే తనివారఁబదివేలు దండాలు వెట్టరాదా (॥కూరు॥) మచ్చికైనదానవు మనసు సోదించనేలే పచ్చిదేరఁ గూడరాదా పలుమారును యిచ్చ యెరిఁగినదాన వింపు లడుగనేలే తచ్చి తచ్చి రతులలో తని వందించరాదా (॥కూరు॥) ఇతవరిదానవు ఇంత సిగ్గు వడనేలే తతి విడె మియ్యరాదా తత్తరానను చతురత శ్రీవేంకటేశ్వరుఁడిట్టె నన్నుఁగూడె కతలుగా నీ వతనిఁగలయఁగరాదా English(||pallavi||) kūrumulūm̐ gŏsarevu guṁpĕnalūm̐ jūbevu āriderinadānavu āyā laṁṭa rādā (||kūru||) sanavugaladānavu saṇam̐gulu rālsanele sĕnagarādā vibhunim̐ jedulārānu vinayabu dānavu vĕṁgĕmu lāḍanele tanivāram̐badivelu daṁḍālu vĕṭṭarādā (||kūru||) machchigainadānavu manasu sodiṁchanele pachchideram̐ gūḍarādā palumārunu yichcha yĕrim̐ginadāna viṁpu laḍuganele tachchi tachchi radulalo tani vaṁdiṁcharādā (||kūru||) idavaridānavu iṁta siggu vaḍanele tadi viḍĕ miyyarādā tattarānanu sadurada śhrīveṁkaḍeśhvarum̐ḍiṭṭĕ nannum̐gūḍĕ kadalugā nī vadanim̐galayam̐garādā