Title (Indic)కన్నె ముద్దరాలు నీతో గట్టివాయితనముదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కన్నె ముద్దరాలు నీతో గట్టివాయితనముదా సన్నల చాయలనేచలపాదిఁ జేతురా (॥కన్నె॥) సిగ్గుపడి లోలోనే శిరసు వంచుకోఁగానే వెగ్గళించి చెలినేల వేఁడుకోనేవు వొగ్గుచుఁ జేతుల సారె నొడ్డుకొంటాఁ దిట్టఁగానే బగ్గనఁబోఁకముడివట్టి విడిచేవు (॥కన్నె॥) మొక్కుచుఁ బయ్యదకొంగు ముసుఁగువెట్టుకోఁగానే గుక్కకచన్నులమీదగోర గీరేవు పక్కన నీదువురము పాదమునఁ జిమ్మఁగానే అక్కున నదిమి సతిఅయా అంటేవు (॥కన్నె॥) అద్దలించిజంకించి అనలెల్లాఁ బెట్టఁగాను వుద్దండాన మోవిఁగెంపు లొనరించేవు సుద్దుల శ్రీవేంకటేశ సుదతిఁ గూడితి నిట్టె కొద్దిమీరఁగూడినానుకోరికఁ దనియవు English(||pallavi||) kannĕ muddarālu nīdo gaṭṭivāyidanamudā sannala sāyalanesalabādim̐ jedurā (||kannĕ||) siggubaḍi lolone śhirasu vaṁchugom̐gāne vĕggaḽiṁchi sĕlinela vem̐ḍugonevu vŏggusum̐ jedula sārĕ nŏḍḍugŏṁṭām̐ diṭṭam̐gāne bagganam̐bom̐kamuḍivaṭṭi viḍisevu (||kannĕ||) mŏkkusum̐ bayyadagŏṁgu musum̐guvĕṭṭugom̐gāne gukkagasannulamīdagora gīrevu pakkana nīduvuramu pādamunam̐ jimmam̐gāne akkuna nadimi sadiayā aṁṭevu (||kannĕ||) addaliṁchijaṁkiṁchi analĕllām̐ bĕṭṭam̐gānu vuddaṁḍāna movim̐gĕṁpu lŏnariṁchevu suddula śhrīveṁkaḍeśha sudadim̐ gūḍidi niṭṭĕ kŏddimīram̐gūḍinānugorigam̐ daniyavu