Title (Indic)కాచుకున్నారు నీవూడిగపు చెలు లిందరును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాచుకున్నారు నీవూడిగపు చెలు లిందరును చే చేఁత జలకమాడ చిత్తగించే దెపుడే (॥॥) గుట్టునఁ బతిగుణాలు కొనియాడనే పట్టె చుట్టి యాతనిమొగము చూడనే పట్టె అట్టే వీడె మిచ్చి నీవు ఆకు మడిచియ్యఁ బట్టె నెట్టన సింగారించుకో నీకు వేళ యపుడే (॥॥) ననిచి యాతని తోడ నవ్వులు నవ్వనే పట్టె పెనఁగి వలపు లెల్లాఁ బెంచనే పట్టె తనివోని రతులపైఁ దమి రేఁచనే పట్టె అనువునఁ గూచుండి ఆరగించే దెపుడే (॥॥) సతతముఁ గెమ్మోవులు చవులు చూడనే పట్టె మితి మీరె నేరుపులు మెచ్చనే పట్టె అతఁడు శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగవు నీవు పతికిఁ బతి గూడేరు పవ్వళించే దెపుడే English(||pallavi||) kāsugunnāru nīvūḍigabu sĕlu liṁdarunu se sem̐ta jalagamāḍa sittagiṁche dĕbuḍe (||||) guṭṭunam̐ badiguṇālu kŏniyāḍane paṭṭĕ suṭṭi yādanimŏgamu sūḍane paṭṭĕ aṭṭe vīḍĕ michchi nīvu āgu maḍisiyyam̐ baṭṭĕ nĕṭṭana siṁgāriṁchugo nīgu veḽa yabuḍe (||||) nanisi yādani toḍa navvulu navvane paṭṭĕ pĕnam̐gi valabu lĕllām̐ bĕṁchane paṭṭĕ tanivoni radulabaim̐ dami rem̐sane paṭṭĕ anuvunam̐ gūsuṁḍi āragiṁche dĕbuḍe (||||) sadatamum̐ gĕmmovulu savulu sūḍane paṭṭĕ midi mīrĕ nerubulu mĕchchane paṭṭĕ adam̐ḍu śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu padigim̐ badi gūḍeru pavvaḽiṁche dĕbuḍe