Title (Indic)కాంతలనెల్లా నొక్కగాడిఁ గట్టేవింతేకాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాంతలనెల్లా నొక్కగాడిఁ గట్టేవింతేకాక మంతనమాడితేనే మర్మము గరఁగునా (॥॥) తలఁపే కలిగితే దండనుండవా నీవు వలచినవాఁడవై తే వాసులెంతువా నెల కొకమాటు వచ్చి నిద్రతెంకి నుండఁగాను తెలిసెనా నాగుణము తేటతెల్లమిగను (॥॥) చుట్టరిక మెఱిఁగితే సులభాన నవ్వవా గుట్టుగన్నవాఁడవైతే కొంచివుందువా యెట్టకేల కిటు మాతో యేలాటా లాడితేనే పట్టెనా నీమనసున పంతపునాసేవలు (॥॥) కరుణించవలసితే కప్పురమిడె మియ్యెవా సరసానకు లోనైతే సమ్మతించవా యిరవై శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి సరివచ్చెనా తొల్లిటి సంగాతపు రతులు English(||pallavi||) kāṁtalanĕllā nŏkkagāḍim̐ gaṭṭeviṁtegāga maṁtanamāḍidene marmamu garam̐gunā (||||) talam̐pe kaligide daṁḍanuṁḍavā nīvu valasinavām̐ḍavai te vāsulĕṁtuvā nĕla kŏgamāḍu vachchi nidradĕṁki nuṁḍam̐gānu tĕlisĕnā nāguṇamu teḍadĕllamiganu (||||) suṭṭariga mĕṟim̐gide sulabhāna navvavā guṭṭugannavām̐ḍavaide kŏṁchivuṁduvā yĕṭṭagela kiḍu mādo yelāḍā lāḍidene paṭṭĕnā nīmanasuna paṁtabunāsevalu (||||) karuṇiṁchavalaside kappuramiḍĕ miyyĕvā sarasānagu lonaide sammadiṁchavā yiravai śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi sarivachchĕnā tŏlliḍi saṁgādabu radulu