Title (Indic)కాదని వేగిరించితే కరఁగీనా ఆతఁ డేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదని వేగిరించితే కరఁగీనా ఆతఁ డేమి వాదు మాని వచ్చినట్టె వచ్చేదె చాలును (॥కాదని॥) మాఁట లాడించకురే మదనమంత్రాలు దప్పీ నేఁటిదాఁక నాపెవద్ద నేరిచినవి నీటుతోడ నాతనిని నిండునిధానమువలె సూచీచూపుల మనము చూచేదె చాలును (॥కాదని॥) గందము వూయకురే యంగజునిముద్రలుమాసీ కందువ నిన్నాళ్ల దాఁకా గడించినవి దిందుపడ నుపారము దేవరకుఁ జూపినట్టు ముందర నన్నియుఁ బెట్టి మొక్కేదె చాలును (॥కాదని॥) మల్లాడి తియ్యకురె మన్మథయోగ మెడసీ తొల్లియూ నాపెవలన దొరకినది కల్ల గాదు నన్ను శ్రీవెంకటనాథుఁడె కూఁడె చెల్లుబడి నీచనవు చేకొనేదె చాలును English(||pallavi||) kādani vegiriṁchide karam̐gīnā ādam̐ ḍemi vādu māni vachchinaṭṭĕ vachchedĕ sālunu (||kādani||) mām̐ṭa lāḍiṁchagure madanamaṁtrālu dappī nem̐ṭidām̐ka nābĕvadda nerisinavi nīḍudoḍa nādanini niṁḍunidhānamuvalĕ sūsīsūbula manamu sūsedĕ sālunu (||kādani||) gaṁdamu vūyagure yaṁgajunimudralumāsī kaṁduva ninnāḽla dām̐kā gaḍiṁchinavi diṁdubaḍa nubāramu devaragum̐ jūbinaṭṭu muṁdara nanniyum̐ bĕṭṭi mŏkkedĕ sālunu (||kādani||) mallāḍi tiyyagurĕ manmathayoga mĕḍasī tŏlliyū nābĕvalana dŏraginadi kalla gādu nannu śhrīvĕṁkaḍanāthum̐ḍĕ kūm̐ḍĕ sĕllubaḍi nīsanavu segŏnedĕ sālunu