Title (Indic)కాదనేమా నేము నీ గయ్యాళితనములకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాదనేమా నేము నీ గయ్యాళితనములకు ఆదెస నీదెసను నీవాడినట్టే అయ్యీని (॥కాద॥) పంతమాడి నిన్ను నంత పరచఁగ నోపుదుమా చెంత నుండి నీసేవ సేసేముగాక యింత నీకు వేడుకై తెనెందునో యేమింక నేము అంత వేగిరించకుమీ ఆడినట్టె అయ్యీని (॥కాద॥) సరికిబేసికి నిన్ను సాదించ నోపుదుమా పెరరేఁచి చిత్తము దర్పించేముగాక కరుణ నీకుఁ బుట్టితే కానిమ్మనఁగ వలదా అరుదుగాఁ గోరకునీవినట్టె అయ్యీని (॥కాద॥) శ్రీవేంకటేశ నినను జీరదియ్య నోపుదుమా మూవంకఁ గూడితి మిఁక మొక్కేముగాక యీవలమన్నించితేను యెప్పడూ నీవారమే ఆవిధాన నింకా నీవాడినట్టె అయ్యీని English(||pallavi||) kādanemā nemu nī gayyāḽidanamulagu ādĕsa nīdĕsanu nīvāḍinaṭṭe ayyīni (||kāda||) paṁtamāḍi ninnu naṁta parasam̐ga nobudumā sĕṁta nuṁḍi nīseva sesemugāga yiṁta nīgu veḍugai tĕnĕṁduno yemiṁka nemu aṁta vegiriṁchagumī āḍinaṭṭĕ ayyīni (||kāda||) sarigibesigi ninnu sādiṁcha nobudumā pĕrarem̐si sittamu darbiṁchemugāga karuṇa nīgum̐ buṭṭide kānimmanam̐ga valadā arudugām̐ goragunīvinaṭṭĕ ayyīni (||kāda||) śhrīveṁkaḍeśha ninanu jīradiyya nobudumā mūvaṁkam̐ gūḍidi mim̐ka mŏkkemugāga yīvalamanniṁchidenu yĕppaḍū nīvārame āvidhāna niṁkā nīvāḍinaṭṭĕ ayyīni