Title (Indic)జాణతనమెంచవద్దా సతుల యడాటాన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) జాణతనమెంచవద్దా సతుల యడాటాన వీణె వాయించినదాఁకా వేగిరమా (॥జాణ॥) మొగముచూడఁగానే మొక్కులు మొక్కేయాపెను అగడుసేసి పెనఁగి యలయింతురా తగలి యదియుఁగాక తమకించి యంతలోనే బిగువుకుచము లిట్టె పిసుకుదురా (॥జాణ॥) సిగ్గుతోడ విన్నపాలు నేటియాపెను బగ్గనను గోరగీరి పచ్చిసేతురా నిగ్గున నంతటఁబోకనీయుతులెల్లా మెరసి వెగ్గళించి పోఁకముడి వీడఁజేతురా (॥జాణ॥) గుట్టుతోడ వీడెమిచ్చి కూడేటియాపెను ఱట్టువేసి నేర్పు రచ్చనట్టె వేతురా ఇట్టె శ్రీవేంకటేశ యీయలమేలుమంగను గట్టిగానేలి వింత కందునఁ జొక్కింతురా English(||pallavi||) jāṇadanamĕṁchavaddā sadula yaḍāḍāna vīṇĕ vāyiṁchinadām̐kā vegiramā (||jāṇa||) mŏgamusūḍam̐gāne mŏkkulu mŏkkeyābĕnu agaḍusesi pĕnam̐gi yalayiṁturā tagali yadiyum̐gāga tamagiṁchi yaṁtalone biguvugusamu liṭṭĕ pisugudurā (||jāṇa||) siggudoḍa vinnabālu neḍiyābĕnu baggananu goragīri pachchisedurā nigguna naṁtaḍam̐boganīyudulĕllā mĕrasi vĕggaḽiṁchi pom̐kamuḍi vīḍam̐jedurā (||jāṇa||) guṭṭudoḍa vīḍĕmichchi kūḍeḍiyābĕnu ṟaṭṭuvesi nerbu rachchanaṭṭĕ vedurā iṭṭĕ śhrīveṁkaḍeśha yīyalamelumaṁganu gaṭṭigāneli viṁta kaṁdunam̐ jŏkkiṁturā