Title (Indic)ఇయ్యకొంటి రావయ్య ఇంటికి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇయ్యకొంటి రావయ్య ఇంటికి నీవు నెయ్యముగలచోటికి నేరము లెక్కడివి (॥॥) సిగ్గుపడి నీయెదుట చెక్కుపైఁ జెయ్యిడుకొంటే దిగ్గన నీ వంతలోనే తీసి వేసేవు యెగ్గులెంచఁ దప్పులెంచ నేలసిబ్బితిపడేవు సిగ్గుల నింత గలిగితే నేరము లెక్కడివి (॥॥) ముక్కుపై వేలిడుకొని ముందర నిలిచితేను చక్కనుండుమని వేలు సారెఁ బట్టేవు కక్కసించితినా నిన్ను కమ్మటి నేలలోఁగేవు నిక్కపుఁ జుట్టములైతే నేరము లెక్కడివి (॥॥) తఱితోఁ జన్నులుమోవఁ దలవంచుకొంటేను గుఱిగాఁ గాఁగిలించేవు కొప్పువట్టెత్తి యెఱఁగవా శ్రీ వేంకటేశ నన్నేలితివి నెఱజాణతనములే నేరము లెక్కడివి English(||pallavi||) iyyagŏṁṭi rāvayya iṁṭigi nīvu nĕyyamugalasoḍigi neramu lĕkkaḍivi (||||) siggubaḍi nīyĕduḍa sĕkkubaim̐ jĕyyiḍugŏṁṭe diggana nī vaṁtalone tīsi vesevu yĕggulĕṁcham̐ dappulĕṁcha nelasibbidibaḍevu siggula niṁta galigide neramu lĕkkaḍivi (||||) mukkubai veliḍugŏni muṁdara nilisidenu sakkanuṁḍumani velu sārĕm̐ baṭṭevu kakkasiṁchidinā ninnu kammaḍi nelalom̐gevu nikkabum̐ juṭṭamulaide neramu lĕkkaḍivi (||||) taṟidom̐ jannulumovam̐ dalavaṁchugŏṁṭenu guṟigām̐ gām̐giliṁchevu kŏppuvaṭṭĕtti yĕṟam̐gavā śhrī veṁkaḍeśha nannelidivi nĕṟajāṇadanamule neramu lĕkkaḍivi