Title (Indic)ఇన్నిటా జాణవు నీవు యెంతని పొగడవచ్చు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇన్నిటా జాణవు నీవు యెంతని పొగడవచ్చు నిన్నుఁ జూచి వేడుకకు నెట్టన నవ్వితిని (॥ఇన్ని॥) చెంతనుండి విన్నపాలు సేసితి నింతేకాని యింతిపై బత్తి గలవు యెరుఁగుదుము కొంత గొంత కూరిములు గొసిరితి మింతేకాని వింతలైన మీ వలపు వింటిమి నాఁడే (॥ఇన్ని॥) యేమరక వొకమారు యెచ్చరించితిమిగాని కామినిపె నీ తమి గంటిమి నేము - చూ మరల రావని సొలసితి మింతేకాని చేముంతు వనుచు సంతోసించితిమి నాడే (॥ఇన్ని॥) చొప్పుగాఁ జుట్టరియము చూపితి మింతేకాని యిప్పడఁతి నేలేవని యెంచుకొంటిమి ముప్పిరి మా చెలికిగా మొక్కితి మింతేకాని తప్పక శ్రీవేంకటేశ తనిసితిమి నాఁడే English(||pallavi||) inniḍā jāṇavu nīvu yĕṁtani pŏgaḍavachchu ninnum̐ jūsi veḍugagu nĕṭṭana navvidini (||inni||) sĕṁtanuṁḍi vinnabālu sesidi niṁtegāni yiṁtibai batti galavu yĕrum̐gudumu kŏṁta gŏṁta kūrimulu gŏsiridi miṁtegāni viṁtalaina mī valabu viṁṭimi nām̐ḍe (||inni||) yemaraga vŏgamāru yĕchchariṁchidimigāni kāminibĕ nī tami gaṁṭimi nemu - sū marala rāvani sŏlasidi miṁtegāni semuṁtu vanusu saṁtosiṁchidimi nāḍe (||inni||) sŏppugām̐ juṭṭariyamu sūbidi miṁtegāni yippaḍam̐ti nelevani yĕṁchugŏṁṭimi muppiri mā sĕligigā mŏkkidi miṁtegāni tappaga śhrīveṁkaḍeśha tanisidimi nām̐ḍe